రేణు దేశాయ్ సంచలన పోస్ట్.. పవన్ కల్యాణ్ ఆ వీడియో షేర్ చేస్తూ..
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గతంతో పోలిస్తే ఇటీవల మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్‌పై ఆమె వరుస పోస్టులు పెడుతూ వస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. అయితే పవన్ అభిమానులు రేణు దేశాయ్‌ను టార్గెట్ చేసుకుని మేసేజ్‌లు చేస్తున్నారు. వారికి తనదైన రీతిలో ఆమె కౌంటరిస్తూనే ఉన్నారు.
పవన్ కల్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసభ్యకరంగా మెసేజ్‌లు సైతం పెట్టారు. దీనిపై రేణు దేశాయ్ వారికి గట్టిగానే కౌంటరిచ్చింది.నేను చేసే ప్రతి పోస్ట్‌ను ఎందుకు నా మాజీ భర్తతో పోలుస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు నేను ఇప్పటికే వందల కొద్ది పవన్ అభిమానుల అకౌంట్స్‌ను డిలీట్ చేసి బ్లాక్ చేసి ఉంటానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా పవన్ కల్యాణ్ గురించి ఓ పోస్ట్‌ను షేర్ చేశారామె. తాజాగా రేణు దేశాయ్ పవన్ కల్యాణ్‌తో నటించిన జానీ సినిమాలోని ఓ వీడియోను షేర్ చేశారు. నేను నమ్మలేకపోతున్నాను ఇది నేనేనా అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చారు. ది. అలాగే రెండు లవ్ సింబల్స్ కూడా జత చేసింది. ఇక అది చూసిన అభిమానులు పవన్‌పై తనకున్న ప్రేమను రేణు దేశాయ్ ఈ విధంగా బయటపెట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications