రేణు దేశాయ్ సంచలన పోస్ట్.. మాట్లాడే గొంతులను మూయించడమే స్వేచ్ఛ అంటూ..
పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఇదిలా ఉంటే తన మాజీ భర్త పవన్ అభిమానుల నుంచి ఆమె ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. పవన్‌కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
వీరిపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్‌ను నేను వదిలేయలేదని..ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెబుతూ వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇక తన కొడుకు అకీరాపై పవన్ అభిమానులు కామెంట్స్ చేశారు. అకిరాను PSPK2 అంటూ.. పవన్ కళ్యాణ్ 2 (PK 2) అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నారు. అంతేకాదు తొందరగా హీరో అయిపో అన్న అని ఒకరు, ఎడిటర్ అవ్వండి అంటూ మరొకరు కామెంట్స్ చేశారు. అయితే దీనిపై రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేద పిల్లల చదువు,ఆరోగ్యం, మూగ జీవాలు కోసం సోషల్ మీడియాలో ఆమె ఫండింగ్ కలెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న తప్పులపై తనదైనశైలిలో స్పందిస్తుంటారు. తాజాగా కోల్‌కత్తాలోనీ ఆర్ జీ కర్ మెడికల్ హాస్పిటల్‌లో ఓ ట్రైనీ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యం గురించి తన ఇన్‌స్టా వేదికగా రేణు దేశాయ్ స్పందించారు.
అందులో భాగంగా drkajalsinghh అనే ఇన్‌స్టా గ్రామ్ ఐడీ ద్వారా ఓ డాక్టర్ పెట్టిన పోస్టును ట్యాగ్ చేస్తూ డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం చేసి, చిత్రహింసలు పెట్టి చంపారు అయినా అది మనకు ఓకే కదా అని ఓ సంచలన కామెంట్స్ చేసింది. ఇదే సమయంలో ఆ డాక్టర్‌కు రేణు దేశాయ్ పలు ప్రశ్నలు అడగడం జరిగింది.
పనిలో ఉన్న మహిళపై అత్యాచారం చేసే స్వేచ్ఛనా?
అత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే స్వేచ్ఛనా?
అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను మూయించే స్వేచ్ఛనా?
మీకు దగ్గరగా ఉన్నవారు అత్యాచారం చేసే వరకు మౌనంగా ఉండే స్వేచ్ఛనా?
వైద్యులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు పట్టించుకోకుండా నిశ్శబ్ద ప్రేక్షకుడిగా మారడానికి స్వేచ్ఛనా? అంటూ రేణు దేశాయ్ ప్రశ్నించింది. దీంతో చాలామంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications