ఆ హీరో సర్వస్వం అర్పించుకోవాలన్నాడు..రీతూ చౌదరి సంచలన కామెంట్స్
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ దక్కించుకున్న రీతూ చౌదరి తన జీవితంలో ఎదురైనా లైంగిక వేధింపుల గురించి ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోన్న వారిలో రీతు చౌదరి కూడా ఒకరు. విజయవాడకు చెందిన రీతూ చౌదరి సీరియల్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత జబర్థస్త్‌లో కనిపించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం జబర్థస్త్ మానేసిన ఈ హాట్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరిని 1 మిలియన్‌కుపైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సుదీర్ఘ కాలం పాటు యాంకరింగ్, యాక్టింగ్‌తో అలరించిన రీతూ చౌదరి.. ఓ సందర్భంలో జబర్ధస్త్‌లోకి వచ్చి స్కిట్ చేసింది.

అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి దాన్నీ సద్వినియోగం చేసుకోవడంతో రీతూ చౌదరికి జబర్ధస్త్‌లో స్థానం సుస్థిరం అయింది. ఆ తర్వాత ఎన్నో షోలలో పాల్గొనేందుకు దోహదం చేసింది. ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరించిన రీతూ చౌదరి.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయిందనే చెప్పాలి. అందుకే ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, అడపాదడపా కొన్ని ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఆడిషన్స్ కోసం వెళ్తే.. మేనేజర్ వచ్చి ఒక సీరియల్ హీరో పేరు చెప్పి అతనితో అలా ఉంటేనే అవకాశం వస్తుందని అన్నాడని..నువ్వు ఎవరిని తీసుకురావొద్దు, ఒక్కదానివే రావాలని చెప్పాడని రీతూ తెలిపింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడే నన్ను అలా అడిగారు. సీరియల్ యాక్టర్ అలాంటి వాడా అని షాక్ అయ్యానని వెల్లడించింది. నా కెరీర్ మొదలయ్యాక ఆ ఫేమస్ సీరియల్ యాక్టర్‌తోనే ఓ సీరియల్‌లో నటించాను. అప్పుడు ఆ యాక్టర్‌ని.. ఆ సంఘటన గురించి అడగాలి అని అనుకున్నా కానీ ఎందుకో అడగలేకపోయానని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. అయితే ఆ సీరియల్ యాక్టర్ పేరు మాత్రం ఆమె వెల్లడించలేదు. ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ గురించి రీతూ చౌదరి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications