విడాకులు తీసుకున్న తెలుగు హీరోయిన్..? పెళ్లి ఫొటోలు డిలీట్

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం..ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఓ వెలుగు హీరోయిన్ విడాకులు తీసుకున్నారనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు స్వాతి. తొలుత బుల్లితెర యాంకర్‌గా స్వాతి కెరీర్ ప్రారంభించింది. కలర్స్ ప్రొగ్రామ్ ద్వారా స్వాతి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ కార్యక్రమం ద్వారా ఆమెకు దక్కిన గుర్తింపు వల్లే ఆమెకు "కలర్స్ స్వాతి" అనే పేరు స్థిరపడింది. ఈ కార్యక్రమం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.నటిగా, వ్యాఖ్యాతగా, గాయకురాలుగా ,డబ్బింగ్ కళాకారిణిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. స్వాతి తన సినీ కెరీర్‌ను కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన "డేంజర్" చిత్రంతో ప్రారంభించింది. తర్వాత వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" సినిమాలో సహాయ పాత్రలో నటించింది.

rumor that Telugu heroine Swathi is divorced

అష్టాచమ్మా చిత్రంతో స్వాతికి మంచి గుర్తింపు లభించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. కార్తికేయ ఈ చిత్రం స్వాతి కెరీర్‌లో మరో మైలురాయి. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.జంప్ జిలాని,బ్రేకప్,లేడీస్ అండ్ జెంటిల్మెన్,చిత్రాంగద, సింబా, మొదలగు సినిమాల్లో స్వాతి నటించారు. ఇదిలా ఉంటే స్వాతి వ్యక్తిగత జీవితం గురించి అనేక వార్తలు నెట్టంట వైరల్ అవుతున్నాయి.

స్వాతి 2018లో వికాస్ వాసు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన ఒక పైలెట్. వీరి వివాహం చాలా గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి తర్వాత స్వాతి సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటున్నారు. కానీ, ఈ మధ్యకాలంలో స్వాతి గారి విడాకుల గురించి చాలా రూమర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమె తన భర్తతో ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. ఇప్పటి వరకు స్వాతి లేదా ఆమె భర్త విడాకులపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+