హిట్టు కొట్టి 10 ఏళ్లు అయింది.. ఇళ్లు అమ్మేసిన సూపర్ స్టార్

సినీ ప్రపంచంలో ఏ హీరోకి అయినా సినిమా కష్టాలు తప్పవు. మనదంటూ ఒక రోజు వచ్చేంతవరకూ ఆటుపోట్లు భరించాల్సిందే. సినిమాలు అన్నాక హిట్ కావడం లేదా ప్లాఫ్ కావడం సాధారణం. సాధారణ నటుల నుంచి సూపర్ స్టార్స్ వరకూ కెరీర్ లో వైఫల్యాలు సహజం. అయితే పెద్ద హీరోల పరిస్థితి అందుకు భిన్నం. వాళ్లు కొడితే కుంభస్థలం బద్ధలు కొడతారు.. లేదా అట్టర్ ప్లాఫ్స్ ఇస్తారు. అయితే ఇప్పుడు ఆ సూపర్ స్టార్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ హీరోకు సరైన హిట్ పడి 10 ఏళ్లు దాటిపోయింది. దీంతో ఆయన షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్ల క్రితం ఆయన క్రేజ్ వేరు. దబాంగ్, ఏక్ థా టైగర్, బజరంగీ బాయ్ జాన్, సుల్తాన్ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఒక్కో సినిమా రూ. వందల కోట్లు కొల్లగొట్టాయి. కానీ ప్రస్తుతం ఆయనకు కాలం కలిసి రావట్లేదు. ఏ సినిమా చేసినా ప్లాఫ్ గానే మిగిలిపోతుంది. ఇటీవల సల్లూ భాయ్ చేసిన సికందర్, టైగర్-3, కిసి కా భాయ్ కిసి కా జాన్, రాధే, భారత్, దబాంగ్ 3 ఇలా వరుస బెట్టి బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఈ క్రమంలో ఆయనకు హిట్ తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం గాల్వన్ అనే సినిమా చేస్తున్నారు.

Salman Khan Sells Mumbai Apartment for Rs 5 35 Crore

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముంబైలోని తన అపార్ట్ మెంట్ అమ్మేశారు. 1,318 గజాలు ఉన్న అపార్ట్ మెంట్ ను రూ. 5.35 కోట్లకు అమ్మేశారు. ఈ అపార్ట్ మెంట్ ముంబై బంద్రాలోని శివ్ అస్తాన్ హైట్స్ లో ఉంది. ఈ మేరకు జులై లోనే ఈ అపార్ట్ మెంట్ బయర్స్ చేతికి వెళ్లనుంది. అంతేకాక మూడు కార్లు పార్కింగ్ చేసే స్థలాన్ని సైతం సల్మాన్ ఖాన్ విక్రయించినట్లు సమాచారం.

ఈ అపార్ట్ మెంట్ విక్రయానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ జులై 15 న ప్రారంభం అయింది. స్టాంప్ డ్యూటీ ఖర్చులు రూ. 32 లక్షలు కాగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ. 30 వేలుగా ఉన్నాయి. ప్రస్తుతం శివ్ అస్తాన్ హైట్స్ లో ఒక్కో ఫ్లాట్ రెంట్ రూ. 1.5 లక్షలుగా ఉంది. ఇక్కడ అధికంగా సెలబ్రిటీలు, వ్యాపారస్థులు నివాసం ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+