సమంతకు ఇలాంటి ఎఫైర్ అవసరమా?

పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాత మంచి నటిగా పేరు తెచ్చుకున్న సమంత తన వ్యక్తిత్వంతో కూడా అభిమానులను ఆకట్టుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ పూజలు చేయించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుంటున్న తరుణంలో విడిపోయారు. ఆ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఏడు సంవత్సరాలు ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. పరిశ్రమలో చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు. హఠాత్తుగా నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత విడిపోతున్నామంటూ ప్రకటించారు.

ప్రతి చిన్న విషయానికి నాగచైతన్యపై విమర్శలు
విడిపోయిన తర్వాత నాగచైతన్య కొంత సమయం తీసుకొని శోభిత ధూళిపాళను వివాహం చేసుకొని స్థిరపడ్డారు. సమంత మాత్రం పరోక్షంగా నాగచైతన్యపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ అభిమానుల నుంచి దూరమైంది. ప్రతి చిన్న విషయానికి నాగచైతన్యను పరోక్షంగా టార్గెట్ చేస్తుండటంతో ఆమె కోరుకున్న రీతిలో సానుభూతి దొరకలేదు. మయోసైటిస్ కోసం చికిత్స తీసుకున్న తర్వాత సినిమాల్లో అవకాశాలు రాలేదు. అప్పటికే ఫ్యామిలీమాన్, సిటాడెల్ సిరీస్ లు చేసింది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ చేస్తోంది. ఈ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. వీరిద్దరూ తెలుగువారే.

Samantha and raj nidimoru affair has become hot topic in Tollywood and bollywood

ఎంతవరకు సరి అనేది సమంత పరిశీలించుకోవాలి
ఇటీవల కాలంలో రాజ్ అండ్ డీకేలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ఎంతో సన్నిహితంగా సమంత ఉంటోంది. ఇద్దరూ కలిసి టూర్లకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏమీ లేదంటూనే ఏదో ఉంది అన్నట్లుగా ఫొటోలు షేర్ చేయడంద్వారా సమంత చెబుతూ వస్తోంది. రాజ్ కు భార్య, పిల్లలు ఉన్నారు. పెళ్లికానివారు ప్రేమలో ఉన్నా, డేటింగ్ చేస్తున్నా సమాజం పట్టించుకోదు. కానీ పెళ్లై, భార్యా పిల్లలున్న వ్యక్తితో డేటింగ్ చేయడం అనేది ఎంతవరకు సరి అనే విషయాన్ని సమంత తెలుసుకోవాలి. రాజ్ భార్య శ్యామాలి పెడుతున్న పోస్టులు కూడా అభిమానులను చాలా ఆవేదనకు గురిచేస్తున్నాయి.

ఆరోగ్యకరంగా సంబంధాలుండాలి
మతమేదైనప్పటికీ మనం చేసే పనులు ఇతరులను బాధించకూడదు అని అర్థం వస్తుంది. దీన్నిబట్టి స్పష్టంగా అర్థమవుతోంది. హీరోయిన్ దొరికింది కదా అని భార్యాపిల్లలను వదిలేసి ఎంజాయ్ చేద్దామనుకుంటే కెరీర్ పరంగా విజయం సాధిస్తారేమోకానీ వ్యక్తిగతంగా విజయాన్ని సాధించలేరు అనే విషయాన్ని రాజ్ తెలుసుకోవాలి. నయనతార ప్రభుదేవాను చేసుకుంటాను అన్న సమయంలో తమిళనాడు మొత్తం తిరగబడింది. ఎందుకంటే అప్పటికే ప్రభుదేవాకు పెళ్లయి పిల్లలున్నారు. అదే శింబుతో ప్రేమలో ఉన్నప్పుడు ఎవరూ అడ్డు చెప్పలేదు.

సమంత అయినా అంతే.. మానవ సంబంధాల విషయంలో ఓ స్పష్టతతో ఉండాలి. ఇన్ స్టాలో పోస్టులు పెట్టినంత సులువు కాదు. ఆరోగ్యకరమైన అనుబంధాలతో జీవించడంవల్ల జీవితాంతం ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో మంచిపేరు తెచ్చుకుంటారు. అలా కాకుండా అనారోగ్యకర సంబంధాలతో జీవిస్తే సమాజం నుంచి బహిష్కరణకు గురికావల్సి వస్తుంది అనే విషయాన్ని రాజ్, సమంత గ్రహించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+