గుడ్ న్యూస్ చెప్పిన సమంత..ప్రియుడితో లవ్ కన్ఫర్మ్..?

గత కొంతకాలంగా సమంత బాలీవుడ్‌ దర్శకుడు రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు.

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజు నిడుమోరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదు. దీంతో రాజు నిడుమోరు అతని భార్య విడిపోయారనే ప్రచారం చేస్తున్నారు.

Samantha and Raj Nidimoru Dating Confirmed Director Attends Samantha s Diwali Celebrations

ఇటీవల సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' సినిమాకు అన్ని పనులు రాజు నిడుమోరు దగ్గరుండి చూసుకున్నారు. అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. సమంత తిరుపతి వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమోరు ఆమెతోనే ఉన్నారు. గతంలో సమంత తన సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. రాజు నిడుమోరు భుజంపై తాను వాలిన ఫొటోను సమంత పోస్ట్ చేసింది.

ఇక ముంబైలో ఒకే కారులో వెళ్తూ ఈ జంట కెమెరా కంటికి చిక్కారు. ఇటీవలే సమంత ప్రియుడితో కలిసి జిమ్‌ నుంచి బయటకు వస్తోన్న వీడియో సైతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. సమంత ఇంట దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడకల్లో సమంత ఫ్యామిలీ సైతం పాల్గొన్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ, సమంత ఇంట జరిగిన దీపావళి వేడుకల్లో దర్శకుడు రాజ్ నిడుమోరు కూడా హాజరయ్యారు.

దీంతో రాజ్‌తో సమంత డేటింగ్‌ పక్కా అని నెటిజన్లు కన్ఫామ్‌ చేసుకుంటూ ఈ జంట కంగ్రాట్స్ చెబుతున్నారు. పండగ పూట సమంత గుడ్ న్యూస్ చెప్పిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.డేటింగ్ కన్ఫామ్‌ చేశారు సరే పెళ్లి ఎప్పుడంటూ మరికొంతమంది వీరిని ప్రశ్నిస్తున్నారు. తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+