ఒంటరిగా ఉండలేను..మొత్తానికి ఓపెన్ అయిన సమంత
హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు. నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు.ఈక్రమంలోనే సైలెంట్‌తో శోభితతో గురువారం నిశ్చితార్ధం చేసుకున్నాడు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది. మరోవైపు సమంత మాత్రం సింగిల్‌గానే ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడుతో సమంత ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవి కేవలం ప్రచారానికే పరిమితం అయ్యాయి.

ఇదిలా ఉంటే ఇటీవల సమంతకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇండియా టుడే గ్రూప్ ద్వారా ఒక అభిమాని క్లిప్‌ను (Xలో) షేర్ చేశాడు. ఈ క్లిప్‌లో సమంత తన సంబంధం గురించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది. ఏదైనా సినిమాలో ప్రత్యేక పాటలు చేయడం గురించి ప్రస్తావించింది. సమంతను ఊ అంటావా... స్పెషల్ నంబర్ నుండి లిరికల్ ఎక్స్‌ప్రెషన్ లాగా ప్రశ్నిస్తూ.. సమంత ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడుతుందా? అని ఇంటర్వ్యూవర్ ప్రశ్నించారు. కొంత సమయం తీసుకున్న తర్వాత ఊ ఊ అంటాను (లేదు) అని సమంత రిథమిక్‌గా బదులిచ్చింది. దీంతో సమంత ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం లేదని చెప్పకనే చెప్పినట్టు అయింది.
ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ''హనీ బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్‌తో పాటు సమంత కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టు స్పష్టం అవుతోంది. ఇదే విధంగా ఈ వెబ్ సిరీస్‌లో సమంత బొల్డ్‌గా కనిపించారనే టాక్ వినిపిస్తోంది. ట్రైలర్‌లో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నట్టు చూపించారు. దీంతో వెబ్ సిరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌కు కొదవలేదని అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్-సమంతల మధ్య బొల్డ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications