శోభితాలో ఉన్నదేంటి...? సమంతలో లేనిదేంటి ..?
అక్కినేని నాగ చైతన్య సినీ అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఆయన గురువారం హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. సమంతతో విడాకుల తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్‌లో ఉన్నాడనే ప్రచారం జరిగింది. గతంలో పలుమార్లు దర్శనం ఇవ్వడంతో వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని అంతా ఫిక్స్ అయ్యారు.
తమ రిలేషన్‌పై వీరు ఎక్కడా స్పందించలేదు. శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య సైలెంట్‌గా డేటింగ్ చేశాడు. మొత్తానికి ప్రేమించిన అమ్మాయితో నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గతంలో నాగ చైతన్య సమంతను కూడా ఇదే రకంగా ప్రేమించి ఘనంగా వివాహం చేసుకున్నాడు. సమంత కెరీర్ ప్రారంభం అయిందే నాగ చైతన్యతో అనే విషయం తెలిసిందే. నాగ చైతన్య ఏం మాయ చేశావే సినిమాతో సమంత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సమంత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

ఇదే సమయంలో నాగ చైతన్యతో అత్యధిక సినిమాలు చేసిన హరోయిన్‌గా సమంత నిలిచారు. వీరి కాంబినేషన్‌లో ఏం మాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య, మజిలి , మహానటి వంటి సినిమాల్లో వీరు కనిపించారు. అయితే మహానటి సినిమాలో వీరిద్దరు కలిసి కనిపించే సన్నివేశాలు లేవు. ఈ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
సమంత ఒంటిరిగా ఉండగా, నాగ చైతన్య మాత్రం విడాకుల తర్వాత శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య సైలెంట్‌గా డేటింగ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. దీనికి సంబంధించిన కీలక అడుగు గురువారం వేయడం జరిగింది. కేవలం అతి కొద్దిమంది సమక్షంలో వీరు నిశ్చితార్థం జరిగింది. అయితే నాగ చైత్య , శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థంపై సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైవాహిక జీవితంలో సమంత కరెక్ట్‌గానే ఉందని, నాగ చైతన్య అలా ఉండలేకపోయాడని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శోభితాలో ఉన్నది ఏంటి..? సమంత లేనిది ఏంటని అభిమానులు నాగ చైతన్యను ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications