రాజ్ నిడుమోరుతో సమంతకు ఎటువంటి సంబంధం లేదు: సామ్ మేనేజర్
మూడు సంవత్సరాల నుంచి సినిమాలు చేయనప్పటికీ ఇప్పటికీ దేశంలో నెంబర్ వన్ కథానాయికగా కొనసాగుతున్న సమంతకు, వెబ్ సిరీస్ లు తీసే దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేల్లో ఒకరైన రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉందంటూ కొన్నాళ్లుగా వర్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను తాజాగా సమంత మేనేజర్ ఖండించారు.
రాజ్ నిడుమోరుతో సమంత డేటింగ్ లో లేరని, అవన్నీ పుకార్లేనని, అటువంటి వార్తలను నమ్మొద్దని ప్రకటించారు. వీరిద్దరి సాన్నిహిత్యంపై ఇప్పటికే రాజ్ భార్య పరోక్షంగా ఎక్స్ లో పోస్ట్ లు పెడుతూ వస్తున్నారు. చాలామంది సమంతను విమర్శిస్తున్నారు. నీకు ఇలాంటి సంబంధం అవసరమా? అంటూ సన్నిహితులు కూడా నిలదీసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ముంబయిలోనే ఎక్కువగా ఉంటున్న సమంత ఏ కార్యక్రమానికి హాజరైనా తప్పనిసరిగా పక్కన రాజ్ నిడుమోరు ఉంటున్నారు. ఇటీవలే వీరు దుబాయ్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. చాలాసార్లు వీరు మీడియా కంటపడ్డారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ కు చికిత్స చేయించుకొని తర్వాత ముంబయికి మకాం మార్చేసింది. హైదరాబాద్ కు చాలా తక్కువసార్లు మాత్రమే వస్తోంది. రాజ్ అండ్ డీకేతో ఫ్యామిలీమ్యాన్2, సిటాడెల్ సిరీస్ లు చేసిన తర్వాత ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే రాజ్ తో పరిచయం ప్రేమగా మారిందంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలను తాజాగా సమంత మేనేజర్ ఖండించారు. సమంత అనుమతి లేకుండా మేనేజర్ ప్రకటన ఇవ్వరు కాబట్టి ఇది నిజమే అని అందరూ అనుకుంటున్నారు. తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని సమంత గతంలో చాలాసార్లు చెప్పింది. అలా చెప్పిన తర్వాత పెళ్లయిన వ్యక్తిని ఎలా మళ్లీ ప్రేమిస్తావని నెటిజన్లు ప్రశ్నించారు. తాను ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా అన్ని విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. నాగచైతన్యతో విడిపోవడంద్వారా మంచి కుటుంబాన్ని పోగొట్టుకుందని, అలా చేయకుండా ఉంటే బాగుండేదని చాలామంది సామ్ అభిమానులు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications