బయటపడ్డ సమంత ఎఫైర్..ప్రియుడు ఇచ్చిన గిఫ్ట్‌తో సెల్ఫీ
హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు.
ఇటీవల ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్‌తో పాటు, అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే రెండో పెళ్లి చేసుకుని .. లైఫ్‌లో సంతోషంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులు సమంతను ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆమె దీనికి అంగీకరించడం లేదని తెలుస్తుంది. సమంతకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదట. ఒకసారి పెళ్లి చేసుకుని మోసపోయానని..మరోసారి అలాంటి తప్పు జరగనివ్వనని సమంత తన ఫ్యామిలీకి చెబుతున్నారట.

ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల సమంత తన పుట్టిన రోజు వేడుకలను గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో ఘనంగా జరుపుకున్నారు. పుట్టిన రోజు సెలెబ్రేషన్స్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పుట్టిన రోజు సందర్భంగా సమంత పోస్ట్ చేసిన ఫొటోల్లో రోజ్ గోల్డ్ చైన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆ చైన్‌ను స్పెషల్‌గా హైలెట్ చేస్తూ సమంత దిగిన ఫొటో ఇప్పుడు కొత్త చర్చకి దారితీస్తోంది. పైగా ఫొటోకు లవ్ థాంక్యూ...అని సదరు ఫొటోకి కామెంట్ జోడించింది.దీంతో సమంతకు ఆ గిఫ్ట్ ఆమె బాయ్ ఫ్రెండ్ ఇచ్చి ఉంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సమంతకు ఆ చైన్ ఓ ఫ్రెండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications