బేబీ బంప్‌తో షాకిచ్చిన సమంత.. నా బేబీతో..నేను అంటూ
'ఏమాయ చేశావే' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన 'దూకుడు' సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా సమంత ఎదిగారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో సమంత నటించారు. ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.
సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఇదే సమయంలో సమంత కొంతకాలం మయసైటీస్ అనే వ్యాధితో బాధపడ్డారు. ఆర్యోగం సహకరించక పోవడంతో సమంత సినిమాలు చేయడం తగ్గించింది. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' తరువాత ఆమె మళ్లీ వెండితెర మీద కనిపించింది లేదు. బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో మాత్రం ఆమె కనిపించారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ 'సిటాడెల్ (హనీ, బన్నీ)' అనే వెబ్ సిరీస్‌లో నటించారు.ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.

ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. హీరో వరుణ్ ధావన్‌తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు. ప్రస్తుతం సమంత చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.సమంత నిర్మాతగా కూడా మారారు.ఆమె నిర్మాతగా 'శుభం'సినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత షేర్ చేసిన ఫొటో ఒకట నెట్టింట వైరల్‌గా మారింది. ఓ బేబీ బంప్ వీడియోను షేర్ చేసింది.నా బేబీతో.. నేను సమంత బేబీ కోసం ఈ వీడియో చేస్తున్నాను అని రాసుకొచ్చింది. సమంత బేబీ పంప్‌తో దర్శనం ఇచ్చింది ఏంటని చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే తాను నిర్మిస్తున్న శుభం సినిమాకు సంబంధించిన వీడియో షేర్ చేశారామె. దీని తెలియని నెటిజన్లు సమంత బేబీ పంప్‌తో కనిపించిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications