విడాకులిస్తే సెకండ్ హ్యాండే..సమంత షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కుడ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయసైటీస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా నాగచైత్యన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. ఈక్రమంలోనే బాలీవుడ్ 'సిటాడెల్ (హనీ, బన్నీ)' అనే వెబ్ సిరీస్‌లో నటించారు.
ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌గానూ రెండు ఎపిసోడ్లు మాత్రమే ఆసక్తికరంగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇదే సమయంలో హీరో వరుణ్ ధావన్‌తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సమంత పెళ్లి , విడాకులపై ఓపెన్ అయ్యారు. నా మాజీ భర్త నాగ చైతన్య కోసం ఖరీదైన కానుకులు ఇవ్వడంలో కాస్తా ఎక్కువగానే ఖర్చు చేశానని సమంత చెప్పుకొచ్చింది.

విడాకులిస్తే మగవారిని ఒకలా, మహిళలను మరోలా చూస్తారని సమంత ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరి మధ్య బ్రేకప్ అయితే అమ్మాయిలదే తప్పని చెప్పే సమాజంలో మనం ఉన్నామని సమంత తెలిపారు.మనం అలాంటి సొసైటీలో బతుకుతుమన్నామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.అమ్మాయిల లైఫ్ అంతే అని, విడాకులు అయితే సెకండ్ హ్యాండ్, యూజ్డ్ అని ట్యాగ్ తగిలిస్తారని సమంత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాటలు అమ్మాయిల కుటుంబాన్ని ఎంతగానో కృంగదీస్తాయని సమంత పేర్కొన్నారు. అలా బాధలో ఉన్న అమ్మాయి గురించి.. ఇలాంటి మాటలు మాట్లాడి.. మరింత బాధపెట్టడం సరైంది కాదని, మరింత నిరాశపరుస్తాయని సామ్ వివరించింది.












Click it and Unblock the Notifications