కొత్త ప్రియుడితో కలిసి దుబాయ్ టూర్ వెళ్లిన సమంత?

అందాల తార సమంతకు సంబంధించి రోజుకో వార్త రాజ్యమేలుతోంది. సోషల్ మీడియాలో సమంత పేరుమీద వార్త లేకుండా రోజు గడవదు. దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా దేశంలో నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అవుతోందంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకుంటోంది. ఫ్యామిలీమ్యాన్2 వెబ్ సిరీస్ తో ప్రారంభమై హనీ బన్నీ చేసింది. అలాగే రక్త్ బ్రహ్మాండ్ చేస్తోంది. ఒక్కో సిరీస్ కు రూ.10 నుంచి రూ.12 లక్షల వరకు పారితోషికం తీసుకుంటోంది.

ముంబయిలో జంటగా ఫంక్షన్లకు
ఫ్యామిలీమ్యాన్ 2 వెబ్ సిరీస్ చేసే సమయంలోనే ఆ సిరీస్ దర్శక ద్వయంలో ఒకరైన రాజ్ నిడుమోరుతో సమంత ప్రేమలో పడిందంటారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని జంటగా దర్శించుకున్నారు. సమంత తీసిన తొలి సినిమా శుభంకు కో ప్రోడ్యూసర్ గా రాజ్ నిడుమోరు వ్యవహరించారు. ఈ విషయంలోనే నాగచైతన్యకు, సమంతకు వివాదం జరిగిందంటూ ఫిలింనగర్ వర్గాలు చెబుతుంటాయి. ఏది ఏకమైనప్పటికీ ఇప్పటికీ రాజ్ నిడుమోరు, సమంత కలిసి ముంబయిలో పలు ఫంక్షన్లకు జంటగా హాజరవుతున్నారు. దీనిపై రాజ్ భార్య పరోక్షంగా కొన్ని కోట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

Samantha went on a Dubai tour with her new boyfriend

ఇద్దరూ కలిసి దుబాయ్ ఎందుకు వెళ్లారు?
ఒకవేళ నిజంగానే వీరిమధ్య అంత సన్నిహిత సంబంధాలు లేకపోతే దుబాయ్ ఎందుకు వెళ్లారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కారణం సమంత తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు. ఆ ఫొటోల్లో సమంత కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంది. ఆ గ్లాస్ లో ఒకదాన్లో నుంచి రాజ్ నిడుమోరు కనిపిస్తున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత అతను శోభితను వివాహం చేసుకున్నాడు. అలాగే సమంత కూడా వెంటనే రాజ్ నిడుమోరును వివాహం చేసుకోవాలని సమంత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అలా చేస్తే టిట్ ఫర్ టాట్ లా ఉంటుందంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతనేది తర్వలోనే బయటకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+