ఓటీటీలోకి సంక్రాంతి సినిమాలు.. రిలీజ్ డేట్స్ ఇవే..!
ఈ ఏడాది సంక్రాంతి పండుగ కారణంగా చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజాసాబ్' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ అయింది. ఆ తర్వాత జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ విడుదల అయింది. ఈ చిత్రాలతో పాటుగా జనవరి 13న మాస్ మహారాజ రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ, జనవరి 14న నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' మూవీ అలాగే శర్వానంద్ నటించిన 'నారీనారీ నడుమ మురారీ' చిత్రం కూడా రిలీజ్ అయింది.
అయితే ప్రభాస్ రాజాసాబ్ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ ముందు ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ పాన్ ఇండియా మూవీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. థియేటర్ రన్ దాదాపు పూర్తి కావడంతో, ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో రావడానికి రంగం సిద్ధమైంది. జియో హాట్ స్టార్ లో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 'రాజా సాబ్' స్ట్రీమింగ్ మొదలుకానుందని అధికారిక ప్రకటన వెలువడింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. చిరంజీవి కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ రీజినల్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తాజాగా మరో అరుదైన రికార్డును సాధించింది. దేశీయంగా రూ.200 కోట్ల నెట్ ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో, చిరంజీవి తెలుగు సినీ ఇండస్ట్రీలో చరిత్రను సృష్టించారు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏ సీనియర్ హీరో చిత్రం కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయిలో నెట్ ను రాబట్టలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఫిబ్రవరి 11 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు స్పష్టం అవుతోంది.
అలాగే టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా డైరెక్టర్ మారి తెరకెక్కించిన 'అనగనగా ఒక రాజు' మూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ విజయంతో నవీన్ పొలిశెట్టి రూ.100 కోట్ల క్లబ్ లో చేరారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది. ఇక ఈ మూవీ రిలీజైన 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల (గ్రాస్) మార్క్ ను అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇక శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. బాక్సాఫీస్ ముందు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 4 న ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం అందుతోంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.
-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ!












Click it and Unblock the Notifications