సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్..!
సంక్రాంతి అంటేనే టాలీవుడ్ కు చాలా స్పెషల్. చాలామంది హీరోలు తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తుంటారు. సంక్రాంతికి ఇంటిల్లిపాదీ సినిమాకు వెళ్లడం ఆనవాయితీ కాబట్టి ఈ సీజన్ లో తమ మూవీ రిలీజ్ అయితే కలెక్షన్స్ భారీగా దండుకోవచ్చని అటు నిర్మాతలు సైతం ప్రణాళికలు వేస్తుంటారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం, ఈ ఏడాది మన శివశంకర వర ప్రసాద్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలు కూడా సంక్రాంతి కానుకగా విడుదలైనవే కావడం విశేషం.
వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో టాలీవుడ్ నలుగురు స్టార్ హీరోలు పోటీ పడనున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. వీరిని తెలుగు చిత్ర సీమకు నాలుగు స్తంభాలుగా చెబుతుంటారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి వీరంతా బాక్సాఫీసు వద్ద పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నట్లు సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చిరంజీవి- బాబీ, బాలకృష్ణ- గోపీచంద్ మలినేని, నాగార్జున- కళ్యాణ్ కృష్ణ, అలాగే వెంకటేశ్- అనిల్ రావిపూడి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి. మరి వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొడుతుందో వేచి చూడాలి..
ఇక 'మన శంకర వరప్రసాద్ గారు' బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు 158వ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. అలాగే 'వీరసింహారెడ్డి' విజయం తర్వాత ఆ దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ పవర్ ఫుల్ కాంబో రిపీట్ కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ మూవీ కథను ఇప్పటికే డైరెక్టర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది.

అలాగే అక్కినేని నాగార్జున- కల్యాణ్ కృష్ణ కాంబోలోనూ ఓ సినిమా రాబోతుంది. వీరి కాంబోలో గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం హిట్ కొట్టింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వీరి కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఓ పోస్టు పెట్టింది. ఇక అనిల్ రావిపూడి- విక్టరీ వెంకటేశ్ కాంబోలోనూ మరో సినిమా రానుంది. ఈ బ్లాక్ బస్టర్ కాంబో మరోసారి రిపీట్ కానుంది.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..??












Click it and Unblock the Notifications