ఆ స్టార్ హీరోతో ముద్దు సీన్ కోసం నాలుగు టేక్స్ తీసుకున్నా - తెలుగు నటి
తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది "అనూజా రెడ్డి". దాదాపు 250 సినిమాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకుంది. వ్యక్తిగత కారణాలతో సుమారు 20 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ఆమె, మరో 250 సినిమాల్లో నటించే శక్తి తనలో ఇంకా ఉందని చెప్పడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంచి క్యారెక్టర్లు, కథలో బలం ఉన్న పాత్రలు లభిస్తే తప్పకుండా నటిస్తానని వెల్లడించింది. దీంతో ఆమె రీ-ఎంట్రీపై ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో అనూజా రెడ్డి పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టీవీ ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉందని, అదే తనకు మళ్లీ ధైర్యం ఇచ్చిందని ఆమె తెలిపింది. ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనూజా రెడ్డి తన సినీ ప్రయాణం, ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రోజులు, ప్రస్తుత టాలీవుడ్ పరిస్థితి, భవిష్యత్ ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు..
తాను ఒకప్పుడు నిరంతరం షూటింగ్స్‌తో బిజీగా ఉండేదానినని తెలిపింది. ఆ రోజుల్లో పాత్రలు చూసుకోకుండా వరుసగా సినిమాలు చేశానని.. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారడంతో ఇండస్ట్రీకి కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. కానీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ.. ఇప్పటికీ అభిమానులు తనను గుర్తు పెట్టుకుని ప్రేమ చూపిస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎక్కువయ్యారని.. పాత నటీనటులను కొంతవరకు మర్చిపోయిన పరిస్థితి ఉందని వాపోయింది. కానీ అభిమానులు తమను గుర్తు పెట్టుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించింది. రీ-ఎంట్రీపై మాత్రం స్పష్టమైన కండిషన్స్ ఉన్నాయని ఓపెన్ అయ్యింది.
సూపర్ స్టార్ కృష్ణతో నటించిన అనుభవం..
ఇక సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించిన అనుభవాన్ని కూడా ఆమె గుర్తు చేసుకుంది. ఒక సినిమాలో కృష్ణతో కలిసి చేసిన ముద్దు సీన్‌కు కేవలం 4 టేకులే తీసుకున్నానని.. ఆ రోజు తనకు ఇప్పటికీ గుర్తుందని చెప్పింది. అప్పటి షూటింగ్ డిసిప్లిన్, ప్రొఫెషనలిజం గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించింది. అలానే మహేష్ బాబు తన ఫేవరెట్ హీరో అని చెప్పింది. మరి దర్శకులు ఈమెకు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.
-
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !!












Click it and Unblock the Notifications