పూరి స్కెచ్ మామూలుగా లేదుగా.. విజయ్ సేతుపతితో మూవీలో ఆ హాట్ బ్యూటీ ?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ - కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఉగాది సందర్భంగా ఆ వివరాలను పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. కేవలం డైరెక్టర్ గానే కాకుండా రచయితగా, నిర్మాతగా టాలీవుడ్ లో ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
కానీ పూరి జగన్నాథ్ గత చిత్రాలు లైగర్, ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని పొందాయి. మరోవైపు విజయ్ సేతుపతి మాత్రం మహారాజా, విడుదల పార్ట్ 2 చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఏస్, ట్రైన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో విజయ్ సేతుపతి.. ఫ్లాప్ లలో ఉన్న పూరితో సినిమా తీయడం ఏంటని తమిళ తంబీలు సోషల్ మీడియా వేదికగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ పూరి మేకింగ్ గురించి బాగా తెలిసిన తెలుగు ఆడియన్స్ ఆయన కమ్ బ్యాక్ ఇస్తే రికార్డులు తిరగరాయడం పక్కా అంటూ సపోర్ట్ గా నిలుస్తున్నారు.

ఈ క్రమంలోనే పూరి - విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. రీసెంట్ గా మూవీ గురించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చినప్పుడు సినిమాకి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు అనౌన్స్ చేస్తామని ప్రకటించారు. కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం కోసం పూర్తి పెద్ద ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలకపాత్రలో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది.
సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ పూరి ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించారని చర్చ నడుస్తోంది. స్క్రిప్ట్ నచ్చడంతో టబు సైతం ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది టబు. దాంతో చాలా కాలం తర్వాత ఇప్పుడు పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వనుందని భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
On this auspicious day of #Ugadi ✨🙏🏻
— Puri Connects (@PuriConnects) March 30, 2025
Embarking on an electrifying new chapter with a sensational collaboration 🔥
Dashing Director #PuriJagannadh and powerhouse performer, Makkalselvan @VijaySethuOffl join forces for a MASTERPIECE IN ALL INDIAN LANGUAGES ❤️🔥
Produced by Puri… pic.twitter.com/Hvv4gr0T2Z
ఉప్పెన, సైరా సినిమాల్లో నటనతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి . ఇక దళపతి విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్ ' సినిమాలో తన విలనిజంతో అందర్నీ ఆకట్టుకున్నాడు. రీసెంట్ గానే మహారాజా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని దక్కించుకుంది.
-
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !!











Click it and Unblock the Notifications