కమిట్ మెంట్ అడిగారు.. ఒప్పుకోలేదు!
సినీ పరిశ్రమలో తరుచుగా ఎదురయ్యే క్యాస్టింగ్ కౌచ్ గురించి సీరియల్ నటి మల్లిక జాగుల తన అనుభవాలను వివరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అవకాశాలు లేక ఎంతోమంది దీనస్థితిలో కూరుకుపోతున్నారని, కొందరు ఇతర పనులు చేసుకుంటున్నారని చెప్పారు. తాను కూడా అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డానని, చీరలు అమ్ముకున్నానని వెల్లడించారు. తెలుగులో పలు సీరియల్స్ లో విలన్ పాత్రలు పోషించారు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తెలుగువారికి అవకాశాలు దక్కడంలేదని, మళయాళం, హిందీ, బెంగాలీ, కన్నడ భాషల నుంచి ఆర్టిస్టులను దిగుమతి చేసుకుంటున్నారన్నారు. అవకాశాల కోసం తాను ఎంతో కష్టపడ్డాను కానీ ఒళ్లు అమ్ముకోలేదన్నారు. కొద్దికాలం అవకాశాలు దక్కకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లానన్నారు. అనారోగ్య సమస్యలు కూడా తలెత్తాయని, ఆసుపత్రికి తీసుకువెళితే బతకడం కష్టమని వైద్యులు చెప్పారన్నారు.

కెరీర్ బాగున్నంతవరకు అంతా బాగానే ఉంటుందని, తేడాచేస్తే కష్టమన్నారు. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎంతోమంది యువతులు బాధపడుతున్నారని, కరోనా తర్వాత తాను కూడా అవకాశాలు లేక ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నారు. క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేని, తాను ఎక్కువగా వ్యాంప్ క్యారెక్టర్లు చేయడంతో చాలామంది తక్కువ చేసి చూసేవారని, చులకనగా, హేళన చేశారన్నారు. మరికొందరు కమిట్ మెంట్ అడిగారని, తాను ఒప్పుకోలేదన్నారు. తాను ఒప్పుకోనందుకు నెలరోజులు టార్చర్ పెట్టారని, ఎక్కడా అవకాశాలు రాకుండా చేశారన్నారు. తాను మాత్రం ఎక్కడా ఒళ్లు అమ్ముకోలేదని, ఒళ్లు చూపించలేదని మల్లిక చెప్పారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది పరిశ్రమలో అంతర్భాగంగా మారిపోయిందని, దాన్ని ఇండస్ట్రీ నుంచి వేరుచేసినప్పుడే మహిళలకు ఎక్కువ స్వాతంత్ర్యం లభిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications