మరో రికార్డు దిశగా షారుక్ ఖాన్ జవాన్.. కలెక్షన్ల వర్షం ఎలా ఉందంటే!!

అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, లేడీస్ సూపర్ స్టార్ నయనతార, దీపికా పదుకొనే నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులు సృష్టిస్తుంది. జవాన్ సినిమాకు ఊహించిన దాని కంటే ఎక్కువగా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. సెప్టెంబర్ 7వ తేదీన విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఊహించని విధంగా వెయ్యికోట్ల రూపాయల మార్కుకు కలెక్షన్ల వరద కురిపిస్తుంది. ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే 821. 85 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా 900 కోట్లు మార్కుకు చేరుకుంటున్న సినిమాగా జవాన్ రికార్డును తన ఖాతాలో వేసుకోబోతుంది.

Jawan Movie Collections

పఠాన్ సినిమా తర్వాత వరుస హిట్ సినిమాగా జపాన్ సినిమాను హిట్ కొట్టిన షారుక్ ఖాన్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా షారుక్ ఖాన్ జవాన్ మేనియా ఊపేస్తోంది.

2023 కి ముందు కొంతకాలం షారుక్ ఖాన్ పెద్ద హిట్ సినిమాలు సాధించలేదు. కొంతకాలం పాటు షారుక్ ఖాన్ ట్రాక్ రికార్డ్ ఏమంత బాగోలేదు. వరుస పరాజయాలు ఆయన సినిమాలను పలకరించగా, కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుతో వ్యక్తిగత జీవితంలో కూడా షారుక్ ఖాన్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కానీ 2023 వ సంవత్సరం పఠాన్ బాక్సాఫీస్ బద్దలు కొట్టింది.

Jawan Movie Collections

ఆ తర్వాత వరుసగా వచ్చిన జవాన్ మరో బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలు షారుఖ్ ఖాన్ నటన అద్భుతంగా ఉందని సినీ ప్రముఖులు పలువురు కితాబిచ్చారు. తండ్రి,కొడుకులుగా రెండు పాత్రలకు షారుక్ ఖాన్ న్యాయం చేశాడని, ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన విజయ్ సేతుపతి అద్భుతమైన నటనతో అందరిని మెప్పించారని టాక్.

నయనతార సిన్సియర్ స్పెషల్ ఆఫీసర్ పాత్రలో సూపర్ గా నటించారని, ఇక దీపికా పదుకొనే ఆక్టింగ్ అందరిని మెప్పించింది అని చెప్తున్నారు. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 50 రోజులకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని సినిమా యూనిట్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+