ఆ మెగా హీరోతో లిప్‌ లాక్ చెయ్యడం ఇష్టం లేక ఆ సినిమాని వదిలేశా - హీరోయిన్

సినిమా పరిశ్రమలో టాలెంట్ ఎంత ముఖ్యమో, అదృష్టం కూడా అంతే ముఖ్యం. ఒక్కోసారి మనకు తెలియకుండానే అదృష్టం తలుపు తట్టినా, దాన్ని గ్రహించలేక పోతే పెద్ద అవకాశాన్ని కోల్పోతాం. ప్రస్తుతం నటి శివాని రాజశేఖర్ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోందని తెలుస్తోంది.

శివాని రాజశేఖర్ తన కెరీర్ ప్రారంభంలోనే ఒక సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం పొంది దాన్ని వదులుకున్నానని తాజాగా వెల్లడించింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా 'ఉప్పెన' కోసం ముందుగా ఆమెనే సంప్రదించారట. అయితే, ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు, లిప్ లాక్ సీన్స్ ఉంటాయని దర్శకుడు చెప్పడంతో, తాను అలాంటి వాటిలో నటించలేనని, చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతానని చెప్పి శివాని ఆ సినిమా నుంచి తప్పుకుందట.

shivani rajashekar first choice heroine from uppena movie

శివాని ఆ సినిమాను వదులుకున్న తర్వాత ఆ అవకాశం కృతి శెట్టికి దక్కింది. ఉప్పెన సినిమాలో 'బేబమ్మ' పాత్రలో కృతి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కావడంతో, కృతి శెట్టికి తెలుగులో వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. రామ్, నాగ చైతన్య, నితిన్, నాని వంటి యువ హీరోలతో ఆమె నటించింది.

ప్రస్తుతం శివాని చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఒకవేళ శివాని ఉప్పెనను అంగీకరించి ఉంటే, ఆమె కెరీర్ మరో స్థాయిలో ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒక్క సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకోగలిగేదని, కానీ కేవలం కొన్ని సన్నివేశాల కోసం ఆమె ఆ అవకాశాన్ని కోల్పోయిందని అంటున్నారు. ఈ సంఘటన సినిమా పరిశ్రమలో అదృష్టం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మరోసారి రుజువు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+