స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మనందరికీ సుపరిచితమే. ఆయన సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే హీరో విశాల్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన స్టేజీపైనే కుప్పకూలి పడిపోయారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ప్రముఖ తమిళ హీరో విశాల్ ఆరోగ్యంపై ఇప్పటికే చాలా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఆయన షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడూ ఫిట్ గా ఉండే విశాల్.. ఈ మధ్య సన్నగా పీలగా మారిపోయి.. వణుకుతూ కనిపించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా మరోసారి విశాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్.. అక్కడే స్టేజీపైనే ఉన్నట్టుండి కుప్పుకూలారు. దీంతో ఆయనకు ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

ఏం జరిగింది.. ?

తమిళనాడులోని విల్లుపురంలో కూవాకం కూతాండవర్ దేవాలయ ఉత్సవం సందర్భంగా తిరునంగైవుల అలకిప్ పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే.. స్టేజీ ఎక్కిన కొద్ది సేపటికే ఆయన స్పృహ తప్పి కింద పడిపోయారు. అయితే.. ప్రాథమిక చికిత్స తర్వాత అనారోగ్యం నుంచి కాస్త తేరుకున్నారు విశాల్. ఆ తర్వాత ఆయన ఆస్పత్రికి బయల్దేరారు. విశాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ కార్యక్రమంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

Shocking Moment Hero Vishal Collapses on Stage During Event

కారణం ఇదేనా..?

అయితే గతంలో ఎంతో ఫిట్ గా ఉండే విశాల్ ఇప్పడు ఇలా మారిపోవడానికి గల కారణాలను అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఆయన ఈ ఏడాది జనవరిలో మదగజరాజ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్నారు. అప్పుడు విశాల్‌ను చూసి అంతా షాక్ అయ్యారు. సన్నగా వణుకుతూ ఆయన కనిపించారు. దీంతో అతని ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు విశాల్‌ మళ్లీ స్పృహతప్పి పడిపోవడంతో ఆయన ఫ్యాన్స్ ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.. అయితే ఆహారం తినకపోవడంతోనే విశాల్‌ స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+