బిగ్ షాక్ ఇచ్చిన మరో స్టార్ సింగర్.. ఇకపై స్టాప్ !

స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్‌ గరించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన మధుర గాత్రం సంగీత ప్రియులను అలరిస్తున్నారు. బాలీవుడ్‌ సింగర్‌ అయినప్పటికీ హిందీతో పాటు తెలుగు, తమిళ్‌, మలయాళం సహా పలు భాషల్లో పాటలు పాడుతూ స్టార్‌ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పాడిన ఎన్నో పాటలు చార్ట్ బస్టర్ లుగా మారుమోగుతూనే ఉంటున్నాయి. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు ఈ గాయని.

పన్నెండేళ్ల వయసులోనే పాటలు పాడడం ప్రారంభించి ఇప్పటివరకు దాదాపు 25000లకు పైగా పాటలు పాడింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సింగర్స్ లో ఆమె కూడా ఒకరు. 2012లో విడుదలైన హృతిక రోషన్ నటించిన 'అగ్నిపథ్' సినిమాలోని 'చిక్ని చమేలి' పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

star-singer-shreya-ghoshal-shocking-comments-on-chikni-chameli-song-from-agnipath-movie

అయితే గతంలో ఆ పాట పాడినందుకు ఆమె సిగ్గుపడుతున్నట్టు తెలిపింది. ఐటెమ్ సాంగ్స్ లో అసభ్య పదజాలం వాడుతుంటారని.. చిన్న పిల్లలు కూడా వాటి అర్థమేంటో తెలియకుండా పాడేస్తున్నారని అన్నారు. ఓ ఐదారేళ్ల పిల్ల అలాంటి లిరిక్స్ పాడటం సరికాదు అని శ్రేయా ఘోషాల్ చెప్పుకొచ్చింది.ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ అదే పాట గురించి మళ్ళీ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆ పాటలో అద్భుతమైన ట్యూన్, కళాత్మకత ఉన్నాయని.. కానీ చిన్న పిల్లలు ఆ పాటలోని అర్థం తెలియకుండా పాడుతుంటే ఇబ్బందిగా ఉందన్నారు. కొన్నిసార్లు తన దగ్గరకు వచ్చి ఆ పాట పాడమని అడిగితే చెప్పలేని అసౌకర్యానికి గురయ్యేదాన్నని ఓపెన్ అయ్యారు. అందుకే అప్పటి నుండి పాటలను ఎంచుకునేటప్పుడు సాహిత్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నానని వివరించారు.

star-singer-shreya-ghoshal-shocking-comments-on-chikni-chameli-song-from-agnipath-movie

ఇక ఆ తర్వాత అలాంటి ఎన్నో ఐటెం సాంగ్స్ ఆఫర్లు వచ్చినా నేను సున్నితంగా తిరస్కరించానని శ్రేయ ఘోషల్ తెలిపారు. ఒక సింగర్‌గా కేవలం ట్యూన్‌కే కాకుండా, పదాలకు కూడా విలువ ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అలా తన పాటల ఎంపికలో సరికొత్త నిబంధనలను విధించుకున్నట్టు స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఈ స్టార్ సింగర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+