నాగార్జునను ఇరకాటంలోకి నెట్టిన హీరోయిన్..?
హీరో నాగార్జున గురించి ఇండస్ట్రీలో ఎవరినైనా అడిగితే ఆయన నట సామ్రాట్ నాగేశ్వరరావు కుమారుడని, మన్మథుడని, గ్రీకు వీరుడని , అమ్మాయిల కలల రాకుమారడని ఇలా రకరకాలుగా చెబుతుంటారు. అయితే ఇండస్ట్రీలో నాగార్జునకంటూ ప్రత్యేక స్థానం ఉంది. శివ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ మార్క్ సెట్ చేశారాయన.అన్నమయ్య సినిమాతో తాను భక్తితర మూవీలను సైతం చేయగలరని నిరూపించారు. అక్కినేని నాగేశ్వరరావు కొడుగ్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాగార్జున తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.
వెండితెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా తనకు ఎవరు పోటీ లేరని బిగ్‌బాస్ షోతో మరోసారి నాగార్జున నిరుపించుకున్నారు. హీరోయిన్లందరూ కూడా నాగార్జునతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుకుంటారు. మరోవైపు నాగార్జున చాలామంది హీరోయిన్లలను ఇండస్ట్రీకి పరిచియం చేశారు. అలాంటిది ఓ హీరోయిన్ మాత్రం నాగార్జునను తెగ ఇబ్బంది పెట్టిందట. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు శ్రియ. అవును మీరు వింటుంది నిజమే. ఇష్టం సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన శ్రియ, నాగార్జునతో నటించిన సంతోషం సినిమాతో తొలి హిట్‌ను అందుకుంది.

అయితే సంతోషం సినిమా సమయంలో శ్రియ టైమ్‌కి షూటింగ్‌కు వచ్చేది కాదట. చాలా సార్లు ఆమె కోసం వెయిట్ చేయాల్సి వచ్చిందట. నాగార్జునే స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. ఆమె వల్ల షూటింగ్ ఆలస్య అయ్యేదట. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా చెప్పడం జరిగింది. ఓ ఇంటర్య్వూలో బాగా లేజీ హీరోయిన్ ఎవరనేది ప్రశ్నించగా, శ్రియా పేరు చెప్పారు నాగార్జున. ఆ అమ్మాయి చాలా లేజీ అని, షూటింగ్‌లకు ఎప్పుడూ లేట్‌గా వస్తుందని, దీంతో చాలా సార్లు ఇబ్బందిపడినట్టు నాగార్జున తెలిపారు. ఈ విషయంలో శ్రియాకు క్లాస్ కూడా పీకానని నాగార్జున తెలిపారు. నాగార్జున, శ్రియా కలిసి సంతోషం, బాస్, నేనున్నాను, మనం సినిమాలు చేశారు. ఇందులో మనం క్లాసికల్‌గా నిలిచింది. పెళ్లి తర్వాత శ్రియా సినిమాలు చేయడం తగ్గించింది.












Click it and Unblock the Notifications