ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న డీజే టిల్లు?
తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద పెద్ద సెలబ్రిటీలంతా వివాహాలు చేసుకుంటున్నారు. త్వరగా పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడిపోవడాన్ని ఇష్టపడుతున్నారు. అంతేకాదు.. ఒకవేళ క్రేజ్ తగ్గిపోతే ఎవరూ పట్టించుకోరు అన్న భయం కూడా వారిని వెంటాడుతోంది. దీంతో చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడానికి హీరోలు ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో సిద్ధు జొన్నలగడ్డ కూడా చేరిపోయారు.
డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. తాజాగా సిద్ధు వివాహం చేసుకోబోతున్నాడు అనే వార్త పరిశ్రమలో వైరల్ గా మారింది. సైలెంట్ గా కిల్లింగ్ లుక్స్ తో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయిన సిద్దు పరిశ్రమలోని హీరోయిన్ ను ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బ్యూటీ కూడా ఇతన్ని ప్రేమిస్తోందట. పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ అమ్మడు ఒక క్యారెక్టర్ కూడా చేసింది.

పలు సినిమాల్లో నటించి క్రేజ్ దక్కించుకున్న ఆ బ్యూటీ సిద్దులు జొన్నలగడ్డ ప్రపోజ్ చేయగానే ఓకే చేసిందట . అంతేకాదు కుటుంబ సభ్యులకు చెప్పి వీళ్ళ ప్రేమను సైతం ఒప్పించుకొని పెళ్లి వరకు తీసుకెళుతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగులో మరో బ్యాచిలర్ వికెట్ డౌన్ అంటూ కుర్రాళ్ళు నాటీ కామెంట్స్ చేస్తున్నారు.
సిద్ధు హైదరాబాదులో పుట్టి పెరిగాడు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో నటిస్తూనే ఎంబీయే పూర్తి చేశాడు. తల్లి 25 సంవత్సరాలు ఆలిండియా రేడియోలో పనిచేసింది. ఆమెతో కలిసి సంగీత కార్యక్రమాలకు వెళ్ళడం వలన సంగీతం మీద ఆసక్తి కలిగింది. నాలుగు సంవత్సరాలు తబలా నేర్చుకున్నాడు. ప్రభుదేవా స్ఫూర్తితో ఐదు సంవత్సరాలపాటు నృత్యంలో శిక్షణ తీసుకున్నాడు.












Click it and Unblock the Notifications