రూ.3000 కోట్లు కలెక్షన్స్, 16 ఆస్కార్ నామినేషన్స్.. షేక్ ఆడించే హర్రర్ థ్రిల్లర్ ఇదే !

ఈ ఏడాది ప్రకటించిన అకాడమీ అవార్డ్స్‌ (ఆస్కార్‌ 2026)లో సంచలన రికార్డు సృష్టించింది హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ "సిన్నర్స్". ఏకంగా 16 ఆస్కార్ నామినేషన్లు దక్కించుకుని సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇంతకుముందు అత్యధిక నామినేషన్లతో గుర్తింపు పొందిన టైటానిక్, లా లా ల్యాండ్ వంటి దిగ్గజ చిత్రాలను కూడా వెనక్కి నెట్టి కొత్త రికార్డును నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా $325.5 మిలియన్లు.. భారతదేశంలో మాత్రమే $120 మిలియన్లకు పైగా వసూలు చేసిందంటే ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ ఏంటో చెప్పొచ్చు.

ర్యాన్‌ కూగ్లర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ దాదాపు రూ.830 కోట్లతో నిర్మించింది. మైఖేల్‌ బి.జోర్డాన్‌ ప్రధాన పాత్ర పోషించగా.. 2 గంటల 17 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ అనిపించకుండా కథను ముందుకు నడిపించారు. మరీ ముఖ్యంగా మూవీ స్టోరీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను పూర్తిగా మంత్రముగ్ధులను చేశాయి. ఒక హారర్‌ చిత్రానికి ఇంత భారీ బడ్జెట్‌ పెట్టడం.. తొలి వారాంతంలోనే అమెరికాలో దాదాపు 48 మిలియన్‌ డాలర్లతో గ్రాండ్‌ ఓపెనింగ్స్ కలెక్ట్ చేయడం ఈ మూవీకే చెల్లింది. 2022లో వచ్చిన 'నోప్‌' తర్వాత ఒక ఒరిజినల్‌ కథతో వచ్చిన సినిమాకు దక్కిన అత్యుత్తమ ఓపెనింగ్‌ ఇదేనని చెబుతున్నారు.

sinners-movie-directed-by-ryan-coogler-starring-michael-b-jordan-got-16-oscar-nominations-and-colle

సినిమా స్టోరీ..

ఈ సినిమా అంతా 1930 కాలం నాటి అమెరికా నేపథ్యంలో సాగుతోంది. (మైఖేల్‌ బి.జోర్డాన్‌ ద్విపాత్రాభినయం) స్మోక్‌, స్టాక్‌ అనే ఇద్దరు ట్విన్‌ బ్రదర్స్‌ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటారు. ఆ తర్వాత చికాగోలో మాఫియా కోసం పనిచేసి డబ్బు సంపాదించి, తమ స్వస్థలమైన క్లార్క్‌స్‌డేల్‌కు తిరిగి వస్తారు. అక్కడ వారు ఊహించని ఒక భయంకరమైన ఆపదను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆశతో వచ్చిన వారికి ఎదురైన ఆ సంఘటనలు, రహస్యాలు, ఊహించని మలుపులు కథను ఉత్కంఠభరితంగా మలిచాయి. ముఖ్యంగా క్లైమాక్స్ భాగం ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుంది. సాంకేతిక హంగులతోపాటు బలమైన భావోద్వేగాలు ఉన్న కథ కావడంవల్లే ఈ చిత్రానికి ఇన్ని నామినేషన్లు దక్కాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏ ఓటీటీలో అంటే..

థియేటర్లలో భారీ హిట్ కొట్టిన ఈ మూవీకి ఓటీటీలోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్ వేదికగా 'సిన్నర్స్' స్ట్రీమింగ్ అవుతుండగా.. ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. ఆస్కార్ రేస్‌లో ముందంజలో ఉన్న ఈ చిత్రం, అవార్డుల ఫలితాల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందో అని హాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

"సిన్నర్స్" నామినేట్‌ అయిన 16 విభాగాలు ఇవే..

1. బెస్ట్‌ పిక్చర్‌

2. బెస్ట్‌ డైరెక్టర్‌ (రేయాన్‌ కూగ్లర్‌)

3. బెస్ట్‌ యాక్టర్‌ (మైఖేల్‌ బి. జోర్డాన్‌)

4. బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్ (వున్మి మోసాకు)

5. బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌ (డెల్రాయ్‌ లిండో)

6. బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే

7. బెస్ట్‌ సినిమాటోగ్రఫీ

8. బెస్ట్‌ కాస్టింగ్‌ (కొత్త కేటగిరీ)

9. బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌

10. బెస్ట్‌ సౌండ్‌

11. బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌

12. బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌

13. బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌స్టైలింగ్‌

14. బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌

15. బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌

16. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌

ఆస్కార్ చరిత్రలో ఒక హారర్ థ్రిల్లర్‌కు ఇన్ని నామినేషన్లు రావడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+