శివ కార్తికేయన్- మురుగదాస్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్..
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి.. వైవిధ్యమైన పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. ఇటీవలే అమరన్ సినిమాతో భారీ హిట్ కొట్టిన శివ.. 300 కోట్ల క్లబ్ లోకూడా చేరారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న శివ కార్తికేయన్ నేడు తన 40వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు శివ. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ AR మురుగదాస్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటిస్తున్నారు. తన కెరీర్ లో 23వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. నేడు శివకార్తికేయన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు. ఈ చిత్రానికి 'మదరాసి' అనే టైటిట్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ గ్లింప్స్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

ఇక ఈ ఫస్ట్ గ్లింప్స్ చూస్తే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ఈ మూవీలో కన్నడ భామా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ నటుడు బిజూ మీనన్, బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు.
Happy Birthday dearest @Siva_Kartikeyan.
— A.R.Murugadoss (@ARMurugadoss) February 17, 2025
The ground is set for the MASSIVE ACTION. Let the HAVOC begin 💥#SKxARM is #Madharasi ❤🔥
TITLE GLIMPSE & FIRST LOOK out now!
▶️ https://t.co/BmRUfEz2Oq pic.twitter.com/LcPcokwikb
మరోవైపు 'అమరన్' సినిమాతో శివకార్తికేయన్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 330 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కోలీవుడ్ హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో శివ 300 కోట్ల మైల్ స్టోన్ క్లబ్ లో చేరిన హీరోగా.. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటి స్టార్ హీరోల సరసన నిలిచాడు. అలానే సుధా కొంగర దర్శకత్వంలో 'పరాశక్తి' అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications