ఈ తెలుగు స్టార్ డైరెక్టర్ రాజమౌళి కంటే ఎక్కువ సంపాదిస్తున్నారా..?

తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటిన దర్శక దిగ్గజం రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి బాహుబలి వరకు కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస సినిమాలు హిట్ కొట్టారు. తన రికార్డులను తానే బద్దలు కొడుతూ తనకు తానే సాటి అనేలా నిలిచారు. ఇక బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో "వారణాసి" మూవీ చేస్తున్నారు.

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా రీసెంట్ గానే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా మహేష్ బాబు ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

social-media-discussions-about-directors-rajamouli-and-trivikram-remuneration

కాగా సినిమా సినిమాకు బడ్జెట్ పెంచుతూ వస్తున్నారు జక్కన్న. దాంతో పాటు ఆయన రెమ్యునరేషన్ కూడా అలానే పెరుగుతూ వస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాజమౌళి మూవీ నిర్మాణంలో షేర్ ను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్టు సమాచారం. కొన్ని ఏరియా హక్కులు కూడా తీసుకుంటారని టాక్ వినిపిస్తుంది. ఆ విధంగా ఈ స్టార్ డైరెక్టర్ ఒక్క సినిమాకు దాదాపు 250 కోట్ల వరకూ అందుతాయని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం ఇండియాలోనే ఒక సినిమాకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుడిగా రాజమౌళి నిలిస్తున్నారని అంటున్నారు. అయితే ఆయన కంటే ఎక్కువ సంపాదిస్తున్న మరో తెలుగు డైరెక్టర్ ఉన్నారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

రాజమౌళి కంటే ఎక్కువ సంపాదిస్తున్న డైరెక్టర్ గా త్రివిక్రమ్ పేరు వినిపిస్తుంది. తెలుగు ప్రేక్షకుల్లో త్రివిక్రమ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాటల మాంత్రికుడుగా పేరొందిన ఈ డైరెక్టర్ గత కొన్నేళ్లుగా వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. అరవింద సమేత, అలా వైకుంఠపురంలో, గుంటూరు కారం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అలానే రైటర్ గా తన సినిమాలకు మాత్రమే కాకుండా.. ఇతర సినిమాలకు కూడా ఆయన పనిచేస్తున్నాడు.

అంతే కాకుండా సితార బ్యానర్ లో త్రివిక్రమ్ భాగస్వామిగా ఉన్నారు. ఈ బ్యానర్ లో సినిమాల పని అంతా త్రివిక్రమే చూసుకుంటారని.. పవన్ కళ్యాణ్ కోసం కథలను వింటూ ఆ కథల మీద వర్క్ చేసినందుకు అటువైపు నుంచి డబ్బులు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా అలా త్రివిక్రమ్ ఏడాదికి 150 కోట్ల వరకూ సంపాదిస్తున్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. అలా చూసుకున్న రాజమౌళి కంటే తక్కువే అనుకోవచ్చు కానీ.. రాజమౌళి 250 కోట్లు సంపాదన ఒక సినిమాకి మాత్రమే అని.. ఆయన సినిమా నాలుగైదేళ్లకొక్కసారి వస్తుందని చెబుతున్నారు. కానీ త్రివిక్రమ్ అలా కాకుండా ప్రతి ఏడాది సంపాదిస్తున్నారని అందుకే ఆయనకే ఎక్కువ అంటూ చర్చ నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+