విజయ్‌కు బిగ్ షాక్..ఆ హీరోతో పెళ్లికి సిద్ధమైన త్రిష ..?
హీరోయిన్ త్రిష క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది.
అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోయింది త్రిష. చిరుతో విశ్వంభర సినిమాలో నటిస్తోంది బ్యూటీ.

సూర్య కొత్త సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్‌గా తీసుకున్నారు. త్రిష తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. 41 ఏళ్ల వచ్చినప్పటికీ తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. ఇదిలా ఉంటే త్రిష పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. తమిళ స్టార్ హీరో విజయ్‌ను త్రిష పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.దానికి తగ్గట్టుగా వీరిద్దరు కలిసి పలుమార్లు దర్శనం ఇచ్చారు. దీంతో వీరు పెళ్లి ఖాయమని అంతా భావించారు.
సరిగ్గా ఇదే సమయంలో త్రిష మరో హీరోను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. హీరో శింబును త్రిష పెళ్లి చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి.వీరిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీంతో శింబు, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా అలై, విన్నైతాండి వరువాయ చిత్రాల్లో శింబు, త్రిష కలిసి నటించారు.మరి తమపై వస్తోన్న ఈ రూమర్స్‌పై ఈ జంట ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications