శ్రీలీల ప్రియుడు గుట్టురట్టు
శ్రీలీల పేరు తెలుగు ఇండస్ట్రీలో మొన్నటి వరకు మార్మోగిపోయింది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచియం అయ్యాడు. పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తరువాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది.
ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో.. దర్శక-నిర్మాతలందరూ శ్రీలీల వెంట పడ్డారు. శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనే అంతలా దర్శక -నిర్మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి,వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. మహేష్ బాబు 'గుంటూరు కారం, పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' , నితిన్ 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్', విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఇదిలా ఉంటే శ్రీలీల ప్రియుడుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మధ్య ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా .. ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు శ్రీలీల అవుననే సమాధానం ఇచ్చింది. ఇప్పుడు కాబోయే భర్త ఇలా ఉండాలాంటూ తన మనస్సులోని కోరికను బయటపెట్టింది. మొత్తానికి బాయ్‌ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకుంటానని శ్రీలీల చెప్పకనే చెప్పినట్టే అయింది.
ఇన్ని హింట్స్ ఇస్తున్న శ్రీలీల తన ప్రేమికుడు ఎవరో మాత్రం చెప్పడం లేదు. తనతో పాటు డాక్టర్ చదువుతున్న వ్యక్తితో శ్రీలీల ప్రేమలో ఉందనే గుస గుసలు వినిపిన్నాయి. శ్రీలీల ప్రస్తుతం షూటింగ్స్‌కు గ్యాప్ ఇచ్చి మరీ తన ప్రియుడుతో షికారు చేస్తుందట. బయటకు తిరుగుతూ, పార్టీలకి వెళ్తూ బాగా ఎంజాయ్ చేస్తుందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్











Click it and Unblock the Notifications