అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా తొలిసారి ట్వీట్ చేసి ఆ స్టార్

వారం రోజుల నుంచి జాతీయ మీడియాతోపాటు స్థానిక మీడియాలో కూడా అల్లు అర్జున్ పేరు మార్మమోగిపోతోంది. వాస్తవానికి పుష్ప2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు ఆయన పేరు మోగిపోవాలి. కానీ అలా కాకుండా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి మాత్రమే ఆయన పేరు మీడియా మొత్తాన్ని ఆక్రమించింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినిమా పరిశ్రమపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ అల్లు అర్జున్ కు మద్దతిస్తూ, ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించారు.

వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా
అయితే అప్పుడు అలా స్పందించిన రాహుల్ రామకృష్ణ తిరిగి ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ కు మద్దతుగా తానుచేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. జరిగిన సంఘటనపై తనకు తప్పుడు సమాచారం అందడంవల్లే అలా చేయాల్సి వచ్చిందని, బన్నీకి మద్దతుగా మాట్లాడానని, ప్రస్తుతం తానుచేసిన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాహుల్ రామకృష్ణ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఒక్కసారిగా అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

star comedian rahul ramakrishna sensational tweet on allu arjun issue

న్యాయంవైపు నిలబడ్డాడు
పరిశ్రమవైపు నుంచి కాకుండా న్యాయంవైపు రాహుల్ నిలబడ్డాడంటూ కొనియాడుతున్నారు. అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా రాహుల్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీన్ని ఇతర హీరోల అభిమానులు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలపై తన అభిమానులను మౌనంగా ఉండమని బన్నీ కోరడంతో వారెవరూ స్పందించడంలేదు. రాహుల్ రామకృష్ణతోపాటు ఒక్కొక్కరుగా పరిశ్రమ నుంచి న్యాయంవైపు నిలబడే అవకాశం ఉందంటున్నారు. జగపతిబాబు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను చూసివచ్చారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే అల్లు అర్జున్ కు వ్యతిరేకంగాకానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగాకానీ ఆయన మాట్లాడలేదు. శ్రీతేజ్ పేరుమీద రూ.2 కోట్లతో ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని అల్లు అర్జున్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+