బెంగళూరు రేవ్ పార్టీలో స్టార్ హీరో కూతురు, స్టార్ డైరెక్టర్?
బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో వివిధ రంగాల్లోని సెలబ్రిటీలు పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. రాజకీయ రంగంలోని సెలబ్రిటీలు, సినీ రంగంలోని సెలబ్రిటీలు, వారి పిల్లలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కన్నడ మీడియాలో వార్తలు పుంఖాను పుంఖలుగా వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్ హౌస్ పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దాడిచేయడంతో ఈ విషయం బయటపడింది.
తెల్లవారుజామున దాడి
జీఆర్ ఫామ్ హౌస్ లో తెల్లవారుజామున మూడుగంటల సమయంలో పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఒక ప్లాన్ ప్రకారం పోలీసులు దాడిచేయడంతో డ్రగ్స్ తో సహా సెలబ్రిటీలంతా పట్టుబడ్డారు. వారినుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 100 మంది ఈ పార్టీకి హాజరయ్యారు. వీరిలో ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అదుపులో 25 మంది అమ్మాయిలు
కన్నడ సినీ పరిశ్రమలో ఈ వార్త సంచలనంగా మారింది. ఓ స్టార్ హీరో కూతురు, అవార్డ్ విన్నింగ్ స్టార్ డైరెక్టర్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. డ్రగ్స్ తీసుకొని బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంతోమంది ప్రముఖులు ఈ పార్టీకి హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో పలు టీవీ నటులు, నటీమణులు ఉన్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్నవారిలో 25 మంది అమ్మాయి ఉన్నారు.
ఎండీఎంఏ, కొకైన దొరికాయి
హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ పార్టీని ఏర్పాటు చేశాడు. పుట్టినరోజు పార్టీ పేరుతో మద్యంతోపాటు డ్రగ్స్ అందజేశాడు. హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో ఈ ఫామ్‌హౌస్ ఉంది. పార్టీలో డ్రగ్స్, కోకైన్ లభ్యమయ్యాయి. ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు కూడా ఉంది. 17 గ్రాముల ఎండీఎంఏ, కొకైన్‌తో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు, పలు వస్తువులను బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications