సమంతకు గోల్డ్ చైన్ గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో?
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ సమంత కొద్ది రోజులుగా చురుగ్గా ఉంటోంది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో కొంతకాలం సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం కథలను వింటోంది. ఇప్పటికే ఆమె నటించిన సిటాడెల్, హనీబన్నీ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్ అండ్ డీకే దీనికి దర్శకత్వం వహించారు. హీరోగా వరుణ్ ధావన్ నటించాడు. అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలోను హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి కానీ చిత్ర యూనిట్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసి పలు విషయాలను చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరవుతోంది. ఇటీవలే తన పుట్టినరోజును గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో జరుపుకుంది. ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏథెన్స్ లో తాను తిరిగిన కొత్త కొత్త ప్రాంతాలు, దిగిన ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేసింది.

వీటిల్లో ఓ ఫొటో మాత్రం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. రోజ్ గోల్డ్ చైన్ ధరించి పిక్‌ను జూమ్ చేసి మరీ పోస్ట్ చేసింది. దానికి జిస్ట్ లాకెట్ ఉండి.. కన్ను ఆకారంలో ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫొటో చూసినవారంతా ఎవరిచ్చారు.. నీ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడా? బాయ్ ఫ్రెండ్ ను మెయిన్ టెయిన్ చేస్తున్నావా? అతనెవరు? స్టార్ హీరోనా? ఏ భాషలో హీరోగా ఉన్నాడు? అందరికీ తెలిసినతనేనా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే సమంత అభిమానులు మాత్రం ఇలా కామెంట్లు పెట్టినవారిపై మండిపడుతున్నారు. బాయ్ ఫ్రెండ్ అయితేనే గిఫ్ట్ ఇవ్వాలా? ఇతర స్నేహితులెవరూ ఇవ్వకూడదా? వంకర టింకర ఆలోచనలు మానుకోవాలంటూ వారిని తిట్టిపోస్తున్నారు. అయితే ఆ చైన్ సమంతకు ఓ ఫ్రెండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఫ్రెండ్ ఎవరనేది సమంత చెబితేనే తెలుస్తుంది. లేదంటే అప్పటివరకు రకరకాల వార్తలు పుకార్ల రూపంలో వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications