గర్భవతైన స్టార్ హీరోయిన్..కర్త,కర్మ మొత్తం ఆ హీరోనే ..!
ఇటీవల హీరోయిన్లు వరుసగా పెళ్లీ పీటలు ఎక్కుతున్నారు. కెరీర్ పీక్ టైంలో ఉండగానే సెలబ్రిటీలు పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. గతంలో పెళ్లి చేసుకుంటే ఆఫర్లు దక్కవనే భయంతో చాలామంది పెళ్లిళ్లకు దూరంగా ఉండేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు, దర్శక,నిర్మాతల మైండ్ సెట్ కూడా మారుతోంది.పెళ్లి తర్వాత కూడా ఆఫర్లు అందిస్తున్నారు. దీంతో చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆలియా భట్, దీపిక పదుకొనె, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, కరీనా కపూర్ ఇలా బాలీవుడ్ హీరోయిన్లంతా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అలాగే పెళ్లి చేసుకున్న జంటలు తల్లిదండ్రులుగా మారడానికి ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. వీరిలో కొంతమంది తల్లులుగా కూడా మారారు. ఇటీవలే కియారా అద్వానీ తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరోయిన్ తాను గర్భవతి కాబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆ హీరోయిన్ మరెవరో కాదు..ఆలియా భట్. బాలీవుడ్ స్టార్ దర్శకుడు మహేష్ భట్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే అలియా భట్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇంటర్మీడియట్ కూడా పూర్తి కాకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆలియాకు వరుస అవకాశాలు వచ్చాయి. దీంతో ఆలియ వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది.

ఇదే సమయంలో కపూర్ ఫ్యామిలీకి చెందిన హీరో రణబీర్ కపూర్‌తో ప్రేమయాణం సాగించింది. అప్పటికే రణబీర్ కపూర్ దీపిక పదుకొనె, కత్రినా కైఫ్ వంటి హీరోయిన్స్‌తో ఎఫైర్ సాగించాడు. వారితో బ్రేకప్ తర్వాత ఆలియాతో ప్రేమలో పడ్డాడు. 2022 ఏప్రిల్ 14న ఆలియా భట్.. రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది. రణబీర్, ఆలియా దంపతులకు ఒక కూతురు ఉంది. తాజాగా ఆలియా మరోసారి గర్భవతి అయిందనే ప్రచారం జరుగుతుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అలియా భట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె రెండోసారి గర్భవతి అనే వార్తలు ఊపందుకున్నాయి.
కేన్స్ వేడుకలో అలియా వేసుకున్న కొన్ని డ్రెస్సుల్లో ఆమె కడుపు కొద్దిగా ముందుకు వచ్చినట్లు కనిపించడంతో, నెటిజన్లు ఆమె మళ్లీ తల్లి కాబోతోందని ఊహాగానాలు మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఆమె ఫోటోలపై "ఆమె గర్భవతిగా కనిపిస్తోంది," "రెండోసారి ప్రెగ్నెంట్ అయిందా?" వంటి కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆలియా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను రెండో బిడ్డకి జన్మనివ్వడానికి రెడీగా ఉన్నానని ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఆమె ప్రస్తుతం గర్భవతి అయిందని భావిస్తున్నారు.ఈ వార్తలపై అలియా భట్ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
-
కొడుక్కి న్యాయం చేసిన షారూఖ్.. కుతుర్ని గట్టెక్కిస్తారా ?? -
బాలీవుడ్ సూపర్ స్టార్ సరసన సమంత? -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు












Click it and Unblock the Notifications