ఆ స్టార్ హీరోయిన్ ఏ సినిమాకు నో చెప్పినా అది ఫ్లాపే... గ్రేట్!

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి దక్షిణాది లోని అన్ని చిత్ర పరిశ్రమల అభిమానులకు తెలుసు. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతోనే కాదు తన డ్యాన్స్ తో అభిమానుల్లో గుండెల్లో నిలిచిపోయింది. సినిమాల ఎంపికలో ఆచూతూచి వ్యవహరిస్తూ, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే సాయిపల్లవి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అలాగే తన వ్యక్తిత్వంతో లేడీ పవర్ స్టార్ అని అభిమానులతో ముద్దుగా పిలుపించుకుంటుంది.

తనదగ్గరకు వచ్చిన ఏ సినిమాలో అయినా పెద్ద హీరో అయినా, భారీ బడ్జెట్ సినిమా అయినా పాత్ర నచ్చకపోతే వెంటనే తిరస్కరిస్తుంది. చిత్రంగా ఆమె వద్దన్న సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అలాంటి సినిమాల జాబితా చూస్తే డియర్ కామ్రేడ్, భోళా శంకర్, చంద్రముఖి2, వలిమై లాంటి ఎన్నో సినిమాలున్నాయి. డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక పాత్రకు సాయిపల్లవిని అనుకున్నప్పటికీ అందులో రొమాన్స్ ఉండటంతోపాటు విజయ్ దేవరకొండతో లిప్ లాక్స్ ఉండటంతో నో చెప్పింది. ఆ సినిమా ఫలితం మనందరికీ తెలిసిందే.

star heroine saipallavi rejected movies in south india

భోళాశంకర్ లాంటి భారీ డిజాస్టర్ చిత్రంలో ముందుగా కీర్తిసురేష్ పాత్రకు సాయిపల్లవినే అనుకున్నారు. అయితే ఆ పాత్ర పెద్దగా ప్రభావం చూపేదిగా లేకపోవడంతో నో చెప్పింది. తర్వాత కీర్తిసురేష్ ను తీసుకున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాతో తనను నమ్మినందుకు మెగాస్టార్ చిరంజీవికి జీవితంలో మరిచిపోలేని డిజాస్టర్ ను ఇచ్చాడు.

చంద్రముఖి 2 లో సాయిపల్లవినే అనుకున్నప్పటికీ కంగనా రనౌత్ తాను చేస్తానని స్వయంగా చెప్పడంతో ఆమెవరకు దర్శక నిర్మాతలు వెళ్లలేదు. వెళ్లినా ఒప్పుకునేది కాదని అభిమానులు చెబుతున్నారు. వలిమై లో అజిత్ సరసన మాంజా వారియర్ పాత్రతోపాటు, లియోలో త్రిష పాత్రకు కూడా సాయిపల్లవి ని సంప్రదించారు. అయితే ఆ పాత్రలు అనుకున్నంత స్థాయిలో గొప్పగా లేకపోవడంతో నటించనని చెప్పేసింది. ఇవన్నీ ఫ్లాప్ సినిమాలే. ఫ్లాప్ అవుతాయని వద్దందా? లేదంటే ఆమె వద్దన్న తర్వాత ఫ్లాపయ్యాయా? అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+