చిరంజీవిపై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..ఆయనతో నటించడం నరకం

మెగాస్టార్ చిరంజీవి... గత 25 ఏళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు. యంగ్ హీరోలు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆయన స్టామినా ఏమాత్రం తగ్గలేదు. 60 ఏళ్ల వయస్సులో కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారాయన. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన వారు వందల సంఖ్యలో ఉంటారు.

ఆయనతో కలిసి ఒక్క సీన్లో నటించిన చాలని నటులందరు భావిస్తుంటారు. అలాంటిది ఓ హీరోయిన్ చిరంజీవితో నటించడం నరకం అని చెప్పి సంచలనం సృష్టించారు. ఇంతకీ చిరంజీవిపై కామెంట్స్ చేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ''ఖైదీ 150''సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటించింది. 10 ఏళ్ల గ్యాప్ తరువాత చిరంజీవి నటించిన సినిమా ఇది.

star heroine shocking comments on mega star chiranjeevi

150 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించి.. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా నిరుపించింది.అయితే ఈ సినిమాలో చిరంజీవిగారితో నటించడం నరకంగా భావించానని హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ తెలిపింది. ఓ మీడియా ఛానెల్‌లో మాట్లాడుతూ చిరంజీవిగారితో నటించడం తనకు దక్కిన అదృష్టమని కాజల్ చెప్పుకొచ్చింది. అయితే ఆయనతో పాటు డ్యాన్స్‌లు చేయడం చాలా కష్టంగా ఉందని..ఇంకా చెప్పాలంటే నరకంలా అనిపించింది.

star heroine shocking comments on mega star chiranjeevi

చిరంజీవిగారు ఎంతటీ కష్టమైన స్టెప్పులనైనా చాలా ఈజీగా చేసేవారని..తాను మాత్రం అయిదారు టేకులు తీసుకునే దాన్ని తెలిపింది. తాను పడుతున్న ఇబ్బందిని చూసి చిరంజీవిగారు తనని ఎంతోగానో ప్రోత్సహించారని..ఏం పర్లేదు కంగారు పడకుండా చేయి అని ధైర్యం చెప్పారని చెప్పుకొచ్చింది. చిరంజీవితో కాజల్ రెండు సినిమాల్లో నటించింది. 'ఖైదీ 150''తో పాటు, 'ఆచార్య' సినిమాలో కూడా చిరంజీవి సరసన కాజల్ నటించింది. అయితే సినిమా నిడివి ఎక్కువ ఉండటంతో కాజల్ సీన్లను ఆచార్య నుంచి తొలగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+