అభిమానుల గుండెలు బద్దలు కొట్టిన సుడిగాలి సుధీర్
సినిమా పరిశ్రమలో కొంతమంది స్టార్ జంటలకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో బుల్లితెరపై అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సుధీర్ - రష్మీ . వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలి అని కోట్లాది అభిమానుల కోరిక. ఆ శుభవార్త వినడం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రభాస్, అనుష్క పెళ్లికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అంతేస్థాయిలో సుధీర్, రష్మి పెళ్లివార్త కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా సుధీర్ అభిమానుల గుండె బద్దలు అయ్యే వార్తలు వినిపించాడు. తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో మాట్లాడిన సుధీర్ కు రష్మికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..? మీ పెళ్లి రష్మితోనే జరుగుతుందా..? అంటూ మీడియా వాళ్ళు ప్రశ్నించారు. దీనిపై సుధీర్ ఫైనల్ గా క్లారిటీ ఇచ్చాడు.

"ఇప్పటికే ఈ విషయం గురించి తాను చాలాసార్లు చెప్పానని, తమది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీనే కానీ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కాదని, తామిద్దరం మంచి స్నేహితులమని సుధీర్ తెలిపారు. మీరు ఎన్ని సార్లు అడిగినా తన సమాధానం ఇదేనని, అంతేకాదని తనకు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదని తేల్చారు. కెరియర్ ఫ్యామిలీ వైపే దేవుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, ఆయన పెళ్లిపై ఇంట్రెస్ట్ కలగజేస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా.. అన్నాడు. అప్పటివరకు తనకు పెళ్లి ధ్యాసే లేదు అంటూ సుధీర్ చెప్పాడు. దీనితర్వాత రష్మి-సుధీర్ అభిమానులు డీలా పడిపోయారు. ఇన్ని సంవత్సరాలుగా కనీసం రష్మిని కాకపోయినా వేరేవారినైనా పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నామని, అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని తేల్చేశాడంటూ అభిమానులు బాధపడుతున్నారు.












Click it and Unblock the Notifications