ఆ బ్లాక్ బస్టర్ మూవీకి బాలయ్య-సుకుమార్ సినిమా సీక్వెలా?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. భగవంత్ కేసరి సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరితో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడమే కాదు.. వరుసగా ఈ మూడు సినిమాలు రూ.100 కోట్లు వసూలు చేసిన ఫీట్ ను కూడా అందుకున్నారు. సీనియర్ హీరోల్లో ఎవరూ అందుకోలేని ఈ రికార్డును బాలకృష్ణ ఒక్కడే అందుకోవడం విశేషం. అంతేకాదు.. యంగ్ హీరోలకంటే వేగంగా సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
భగవంత్ కేసరి తర్వాత బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఏపీ ఎన్నికలకు ముందు లేదంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. దీనితర్వాత మలినేని గోపీచంద్ దర్శకత్వంలో చేస్తారంటున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు మధ్యలో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఒకరకంగా ఇది ఫ్యూజులు ఎగిరిపోయే వార్త అని చెప్పవచ్చు.

బాలయ్యతో సుకుమార్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీని తెరకెక్కించనున్నారు. గతంలో బాలయ్య నటించి సూపర్ డూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా వస్తుందట. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య నత్తి ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నట్లు సమాచారం. అంత పెద్ద స్టార్ హీరో ఇలా నత్తి ఉన్న పాత్రను చేయడానికి అంగీకరించడం గ్రేట్ అంటూ సినీ ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు. మొదటి నుంచి బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. నత్తి ఉన్న పాత్రను చేయనుండటంతో దట్ ఈజ్ బాలయ్య అంటూ నందమూరి ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు..!!












Click it and Unblock the Notifications