భారీగా వసూలు చేస్తున్న సునీల్?
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా సునీల్ పేరు తెచ్చుకున్నారు. కథానాయకుడిగా కొన్ని సినిమాల్లో మెప్పించారు. రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేశారు. కమెడియన్ గా రెండో ఇన్నింగ్స్ ఎప్పుడైతే ప్రారంభించాడో అదే సమయానికి తమిళం నుంచి కూడా ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే తెలుగు కన్నా తమిళంలోనే బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. కమెడియన్ గా, విలన్ గా వరుస అవకాశాలు వస్తున్నాయి.
తమిళంలో సునీల్ నటించిన జైలర్ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. అంతకుముంద శివ కార్తికేయన్ మహావీరన్ సినిమాలో కూడా విలన్ గా మెప్పించాడు. జైలర్ సినిమాతో స్టార్ విలన్ అయ్యాడు. ఈ పాత్ర తమిళ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది. దీంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజా సినిమా మార్క్ ఆంటోని లో కూడా తన నటనతో సునీల్ మెప్పించాడు. ఈ రెండు సినిమాల తర్వాత పారితోషికం భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో రోజుకు రూ.30వేలు తీసుకుంటున్న సునీల్ తమిళంలో రోజుకు రూ.60వేలు తీసుకుంటున్నట్లు సమాచారం.

సునీల్ స్టార్ కమెడియన్ గా బిజీగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కథానాయకుడిగా యూటర్న్ తీసుకున్నారు. హీరోగా మొదటి సినిమా అందాల రాముడు చేశారు. ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. సునీల్ కు ఈ చిత్రం మంచిపేరు తెచ్చిపెట్టింది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న సినిమా చేశారు. అనంతరం పూలరంగడు, మిస్టర్ పెళ్లికొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు వంటి చిత్రాల్లో నటించారు.
-
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్!











Click it and Unblock the Notifications