ఆ బిజినెస్ లో దూసుకుపోతున్న శృంగారతార సన్నీలియోన్

శృంగార తార సన్నిలియోన్ వ్యాపార ప్రపంచంలో దూసుకుపోతోంది. స్టార్ స్ట్రక్ పేరుతో కాస్మెటిక్ ఉత్పత్తుల బ్రాండ్ ను ప్రారంభించిన సన్నిలియోన్ దేశ విదేశాలలో మంచి వ్యాపారవేత్తగా రాణిస్తోంది. శృంగార తారగా మగవారి మనసులను దోచుకునే సన్నిలియోన్ వ్యాపారవేత్తగానూ, ఇతరులకు సహాయం చేసే మంచి మనసున్న వ్యక్తిగాను ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది.

బిజినెస్ లో సన్నీ లియోన్
సన్నీ లియోన్ తన బ్యూటీ బ్రాండ్ స్టార్ స్ట్రక్ ను 2018 లో ప్రారంభించింది ఆమె తన బ్రాండ్ బ్యూటీ ఉత్పత్తులను అనేక ఈవెంట్లలో ప్రచారం చేస్తోంది. అంతేకాదు తన కాస్మెటిక్ బ్రాండ్ అయిన స్టార్ స్ట్రక్ ని దుబాయ్, అబుదాబి, లండన్, ముంబై, బెంగళూరులతో పాటు ప్రస్తుతం ఒడిశా లోనూ విస్తరించింది.

Sunny Leone is a rising star in her business Launched her Cosmetic Brand star struck in Odisha

ఒడిశాలో కాస్మెటిక్ బ్రాండ్ స్టోర్
సన్నీలియోన్ స్టార్ స్ట్రక్ బ్రాండ్ ఇప్పుడు బెంగళూరు తర్వాత ఒడిస్సా లో కూడా అడుగు పెట్టింది. ఒడిశాలో కూడా సన్నీ లియోన్ కాస్మెటిక్ బ్రాండ్ స్టోర్ ను ప్రారంభించింది. స్కిన్ ఫ్రెండ్లీ బ్యూటీ ఉత్పత్తులు సరసమైన ధరలో అందించే విధంగా, అన్ని వయసుల వారికి, అన్ని స్కిన్ టోన్ లకు తగ్గట్టుగా మేకప్ ఉత్పత్తులను రూపొందించి ఎంతో మందితో ప్రశంసలు పొందుతుంది సన్నిలియోన్.

సుకీర్తి పట్నాయక్ స్థాపించిన ఇండల్జ్ సెలూన్ లో సన్నీలియోన్ స్టార్ స్ట్రక్
సన్నీలియోన్ ఆమె భర్త డేనియల్ వెబర్ స్టార్ స్ట్రక్ కోసం చాలా అంకితభావంతో పని చేస్తున్నారు. అయితే సన్నిలియోన్ బ్రాండ్ స్టార్ స్ట్రక్ ఉత్పత్తులు ఒడిశాలోని సుకీర్తి పట్నాయక్ స్థాపించిన ఇండల్జ్ సెలూన్ లో అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. సన్నీలియోన్ మరియు సుకీర్తి పట్నాయక్ మధ్య ఈ సహకారం ఒడిశా మార్కెట్లో సానుకూల ప్రభావాన్ని సృష్టిస్తుందని భావిస్తున్నారు.

సినిమాలలోనూ బిజీగా శృంగార తార
మంచి వ్యాపారవేత్తగా కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ తో దూసుకుపోతున్న సన్నిలియోన్ ఇక వృత్తిపరంగా చూసినట్లయితే తమిళ చిత్రం "కొటేషన్ గ్యాంగ్" కోసం పని చేశారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. గత సంవత్సరం కేన్స్ లో ప్రదర్శించబడిన అనురాగ్ కశ్యప్ యొక్క కెన్నెడిలో ఆమె పాత్రకు కూడా ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది.

బిజినెస్ లోనూ దూకుడుగా సన్నీ లియోన్
ఇక ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కాబోతుంది. ప్రస్తుతం సన్నీలియోన్ హిమేష్ రేషమ్మియా మరియు ప్రభుదేవాతో ఓ మలయాళ ప్రాజెక్టులో నటిస్తోంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే స్ప్లిట్స్ విల్లా x5 నీ కూడా హోస్ట్ చేస్తుంది సన్నిలియోన్. ఇక వృత్తిలోనూ, తన సొంత బ్యూటీ బ్రాండ్ బిజినెస్ లోనూ ఆమె దూకుడు తగ్గటం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+