రజనీకాంత్ ఆస్తుల విలువ తెలుసా?
ఈ ఏడాది డిసెంబరు 12తో సూపర్ స్టార్ రజనీకాంత్ తన 73వ ఏట అడుగు పెట్టారు. జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా జరుపుతున్నారు. ఏడుపదుల వయసులో కూడా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటివరకు 168 సినిమాలు చేసిన రజనీ మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. దేశంలోనే అతి పెద్ద స్టార్ హీరో అయిన రజనీకాంత్ ఒక్కో సినిమాకు తన రెమ్యునరేషన్ రూ.100 కోట్లు తీసుకుంటారు. తన సంపాదనలో 50 శాతం ఛారిటీకి ఖర్చుపెడతారు.
తన సంపాదనలో 50 శాతం సేవా కార్యక్రమాలకు ఖర్చుపెడుతున్నా వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. చెన్నై నగరంలోని పోయెస్ గార్డెన్ ఏరియాలో బంగ్లా ఉంది. ఆ ఇంట్లోనే రజనీకాంత్ నివాసం ఉంటున్నారు. 2002లో దీన్ని నిర్మించారు. ఈ బంగ్లా ధర రూ. 35 కోట్లు అని అంచనా. అలాగే రాఘవేంద్ర మండపం అనే ఫంక్షన్ హాల్ ఉంది. దీని ధర రూ.20 కోట్లు.

తన కార్ గ్యారేజ్ లో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. రూ. 6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ హోస్ట్, రూ.16 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్, హోండా సివిక్, ప్రీమియర్ పద్మిని, టయోటా ఇన్నోవా కార్లను రజనీకాంత్ వివిధ సందర్భాల్లో కొనుగోలు చేశారు. జైలర్ మూవీ నిర్మాత కళానిధి మారన్ ఇటీవలే రజనీకి ఓ లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చారు.
వీటితోపాటు రూ.1.77 కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ X 5, రూ.2.55 కోట్ల విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ జి వ్యాగన్, 3.10 కోట్ల విలువైన లాంబోర్గిని, బెంట్లీ లిమోసిన్ ఉన్నాయి. బెంట్లీ ధర రూ.6కోట్లు కాగా రజనీ అభిరుచికి తగ్గట్లుగా దాన్ని అందంగా డిజైన్ చేశారు. దీంతో ఆ కారు ధర రూ.22 కోట్లు అయింది. మొత్తంగా రజనీకాంత్ ఆస్తుల విలువ రూ. 430 కోట్లు అని అంచనా.












Click it and Unblock the Notifications