మహేష్ బాబు సంచలన రికార్డ్!

సూపర్ స్టార్ మహేష్ బాబును అందరూ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అని ఎందుకు అంటుంటారో మరోసారి నిరూపితమైంది. కుటుంబంతో సహా ప్రేక్షకులను థియేటర్ కు తీసుకురాగలిగేది మహేష్ బాబు ఒక్కరే.. ఇతర ఏ హీరోవల్లా కాదు అని కూడా అంటుంటారు. ఇటీవలికాలం వరకు విడుదలైన మహేష్ బాబు సినిమాలను పరిశీలిస్తే.. ఆయనతోపాటు డైరెక్టర్ కూడా కలిసి సంయుక్తంగా హిట్లు కొట్టేవారు. ఇద్దరి భాగస్వామ్యం హిట్ అయిన సినిమాలో ఉండేది

కొంతకాలం నుంచి మాత్రం ట్రెండ్ ను పరిశీలిస్తే ఎవరితో సంబంధం లేకుండా సోలోగా మహేష్ బాబు రాణిస్తున్నాడు. ఐదారు సంవత్సరాల నుంచి విడుదలవుతున్న మహేష్ బాబు సినిమాలు వసూలు చేసే కలెక్షన్లు ట్రేడ్ పండితులను నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. సినిమాకు వచ్చే టాక్ వేరు.. దానికి వచ్చే కలెక్షన్లు వేరుగా ఉంటాయి. తాజాగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రిన్స్ నెగెటివ్ టాక్ తోపాటు సినీ విమర్శకుల రివ్యూస్ ను కూడా దాటి ఒక రేంజ్ కలెక్షన్లను రాబడుతున్నాడు.

superstar mahesh babu create sensational record

సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా, పర్లేదనే టాక్ వచ్చినా, యావరేజ్ అనే టాక్ వచ్చినా, డిజాస్టర్ అన్నా కూడా రూ.100 కోట్ల షేర్ ను రాబట్టడం ఏ హీరోవల్లా కాదు. పాన్ ఇండియా హీరోలవల్ల కూడా కాదు. ఈ టాక్స్ వచ్చిన సినిమాలన్నీ రెండోరోజే దుకాణం సర్దేసేవి. అయితే ఇక్కడే అందరికంటే భిన్నంగా మహేష్ బాబు మ్యాజిక్ వర్కౌట్ అవుతోంది.. నిర్మాతలను కష్టాల నుంచి, నష్టాల నుంచి బయటపడేస్తోంది.

ఐదుసార్లు రూ.100 కోట్లు రాబట్టిన సినీ హీరోగా అత్యంత అరుదైన రికార్డ్ ను మహేష్ బాబు నెలకొల్పారు. దక్షిణ భారతదేశంలో ఇలా ఐదుసార్లు రూ.100 కోట్లు రాబట్టడమనేది ఏ హీరోవల్లా అవలేదు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట, గుంటూరు కారం సినిమాలు మహేష్ బాబు సాధించిన రూ.100 కోట్ల క్లబ్ లో ఉన్నాయి. గుంటూరు కారం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు. దీంతో ప్రాంతీయ రికార్డుల నుంచి
పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రికార్డులను రాబట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఇకనుంచి వరల్డ్ రికార్డుల గురించే మాట్లాడుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+