మహేష్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

అభిమానులంతా ముద్దుగా ప్రిన్స్ అని పిలుచుకుంటారు. రాజకుమారుడిలా తమ అందమైన హీరో ఉంటాడు కాబట్టి అది తగిన పదమేనని గట్టిగా చెబుతారు. సాధారణంగా సినిమాల్ల హీరోయిన్లు అందంగా ఉంటారు. వారికోసం సినిమాకు రెండుసార్లు, మూడుసార్లు వెళ్లేవారు ఉంటారు. కానీ హీరోల్లో అందంగా ఉండి, తన సినిమా అంటే కుటుంబ సభ్యులంతా కలిసి చూసేలా, వారందరినీ థియేటర్లకు రప్పించేలా ఆయన ఛరిష్మా ఉంటుంది. ఆ హీరో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు.

సినిమా హిట్టా? ఫ్లాపా? అనే టాక్ తో సంబంధం లేకుండా స్టడీగా రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించడమనేది ప్రిన్స్ కు సర్వసాధారణమైపోయింది. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో గ్లోబల్ హీరోగా మారనున్నారు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించుకుంటూ నిజజీవితంలో నిజమైన హీరోగా నిలిచిన మహేష్ బాబు రెమ్యునరేషన్ భారీగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన సంపాదన ఎలా ఉంది? ఆస్తి వివరాలు తెలుసుకుందాం.

superstar mahesh babu property value

మహేష్ బాబు ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కలిగి ఉండటమే కాకుండా హైదరాబాద్ గచ్చిబౌలిలో సెవెన్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏఎంబి సినిమాస్ కలిగివున్నారు. ఏపీ, తెలంగాణలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. రెయిన్ బో ఆసుపత్రులకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఒక్కో వాణిజ్య ప్రకటనలో నటించేందుకు రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మహేష్ బాబు 50 వాణిజ్య ప్రకటనల్లో నటించారు. అలాగే సినిమాకు రూ.80 నుంచి రూ.100 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ తోపాటు ఆసుపత్రుల్లో తన ఆదాయాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు. హైదరాబాద్ లో రూ.40 కోట్ల విలువచేసే ఇల్లు ఉంది. మొత్తంగా ప్రిన్స్ ఆస్తులన్నీ కలిపితే రూ.13 వేల కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+