ఆసుప‌త్రిలో చేరిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌..ఆందోళ‌న‌లో అభిమానులు..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుప‌త్రిలో చేరారు. సోమవారం అర్థరాత్రి చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చేరారు. ఆయ‌న‌కు గుండె సంబంధిత ప‌లు వైద్య ప‌రీక్ష‌లు చేయాల్సి ఉండ‌డంతో ఆయ‌న‌ను ఆసుప‌త్రిలో చేర్పించిన‌ట్లు తెలుస్తోంది. అయితే, ర‌జ‌నీకాంత్ ఆరోగ్య‌ పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

కాగా, ర‌జ‌నీకాంత్‌ ఆసుప‌త్రిలో చేర‌డం విష‌యంపై అటు డాక్ట‌ర్ల నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక, 76 ఏళ్ల వ‌య‌సున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ ప్ర‌స్తుతం ప‌లు షూటింగ్‌ల‌లో బిజీ బిజిగా ఉన్నారు. ఇలాంటి త‌రుణంలో ఆయ‌న ఆసుప‌త్రిలో చేర‌డంపై అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. రజనీకాంత్‌కు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలు చేయాల్సి ఉండటంతో సోమ‌వారం చెన్నైలోని ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. నేడు (అక్టోబర్ 1) సూప‌ర్ స్టార్‌కు ఎలక్టివ్ ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉందని డాక్ట‌ర్లు తెలిపారట. అయితే, ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్యులు తెలిపారు.

Superstar Rajinikanth admitted to the hospital fans are worried

ప‌లు చిత్రాలు..

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ ప‌లు చిత్రాలు చేస్తున్నారు. దర్శకుడు జ్ఞానవేల్ రాజాతో చేస్తున్న వేట్టైయన్ చిత్రం ఈ నెల10వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో రజనీకాంత్ ఓ ఎన్‌కౌంటర్ ఆఫీసర్‌గా క‌నిపించ‌నున్నార‌ట‌.. ఇక‌, వెట్టయాన్ సినిమాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో రానా దగ్గుబాటి నటించిన‌ట్లు స‌మాచారం. వీరితో పాటు బిగ్‌బి అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు లోకేశ్‌ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా ర‌జ‌నీకాంత్ ఓ సినిమా చేస్తున్నారు. దానిపేరు కూలీ. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ జ‌ర‌గుతోంది. ఇదిలా ఉంటే, రజనీకాంత్ ఆసుప‌త్రిలో చేరారు అనే వార్త‌ల‌పై ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+