ఏందయ్యా ఇది ..రామ్ గోపాల్ వర్మతో సురేఖ వాణి
రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పగానే ఒకప్పుడు శివ, అంతం, క్షణం క్షణం వంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలు గుర్తుకు వచ్చేవి. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్పగానే పిచ్చి పిచ్చి సినిమాలు , అమ్మాయిలతో రొమాన్స్ మాత్రమే గుర్తుకు వస్తున్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా ఎలా ఉన్నప్పటికీ ఆయనలో గొప్ప టెక్నీషియన్ ఉన్నారనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ చాలా అమ్మాయిలతో ఫొటోలు దిగుతుంటారు.
వర్మతో ఫొటోలు దిగడం వల్ల సెలబ్రిటీలుగా మారిన లిస్ట్ కూడా పెద్దదే. అరియానా, అషు రెడ్డి, ఇనయా సుల్తానా వంటి వారు రామ్ గోపాల్ వర్మతో ఫొటోలు దిగిన తరువాతే పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మతో ప్రముఖ నటి సురేఖ వాణి సైతం ఫొటో దిగింది. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఇప్పుడు దిగిన ఫొటో కాదని సురేఖ వాణి క్లారిటీ ఇచ్చింది. గతంలో రామ్ గోపాల్ వర్మతో దిగిన ఫొటోనే ఇప్పుడు వైరల్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.

రామ్ గోపాల్ వర్మతో ఫొటో దిగడంపై ఆమె పెద్ద స్టోరీనే చెప్పింది. ఒకసారి రాంగోపాల్ వర్మగారితో కలిసి ఓ ఫోటో దిగాను. ఓ అభిమానిగా చేసిన పని అది. దానిపై ఒకడు ఏకంగా యూట్యూబ్‌లో ఒక ఎపిసోడ్ చేసేసాడని తెలిపింది. ఇలాంటివారిని చూసినప్పుడు ఇంతమంది పని లేకుండా ఖాళీగా ఉంటున్నారా? అనిపిస్తుంది. వాళ్లంతా నా వల్ల డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ విధంగానైనా ఓ నలుగురికి భోజనం పెడుతున్నాను అనే అనుకుంటాని తెలిపింది. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications