ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోవడం పక్కా

తెలుగు ప్రేక్షకులకు నాణ్యమైన కంటెంట్‌ను అందిస్తూ వస్తున్న ఆహా ఓటీటీ, ఇప్పుడు మరో ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ "నెట్‌వర్క్"తో ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ఈ రోజు (జూలై 31, 2025) నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని, శ్రీనివాస్ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు సతీష్ చంద్ర నాదెళ్ళ దర్శకత్వం వహించారు. రమ్య సినిమా బ్యానర్‌పై లావణ్య ఎన్ఎస్, ఎంజి జంగం నిర్మించిన ఈ సిరీస్, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, అద్భుతమైన విజువల్స్‌తో మొదటి నుంచి చివరి దాకా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర బృందం చెబుతోంది.

Suspense thriller Network Cinema is streaming on OTT

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ భారీ అంచనాలను పెంచింది. ఆన్‌లైన్ డిపెండెంట్, ఆన్‌లైన్ గ్యాంబ్లర్, ఆన్‌లైన్ డేటింగ్, ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్ - ఇలా నాలుగు పాత్రలు నెట్‌వర్క్ బ్యాక్‌డ్రాప్‌తో ముందుకు సాగడం, ఆ తర్వాత కథలో వచ్చే మలుపులు ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయి. ''మనం డైరెక్షన్స్ ఇస్తే పని చేయాల్సిన వస్తువు... మన లైఫ్‌ని డైరెక్ట్ చేయకూడదు'' అనే డైలాగ్ కథ యొక్క లోతును తెలియజేస్తోంది.

తాగుబోతు రమేష్, సమ్మెట గాంధీ, జోష్ రవి, మీనా కుమారి, ఛత్రపతి శేఖర్, శివ (హిట్ 2), పద్మంజలి, కల్పలత (పుష్ప తల్లి), జెమినీ సురేష్, సిద్ధార్థ మీనన్, మహేష్ విట్టా, శివాని, మహి, మౌనిక రెడ్డి, జబర్దస్త్ ఫణి, చిత్రం శ్రీను, సుమన్ సెట్టి, ఫన్ బకెట్ భార్గవి, ఫన్ బకెట్ ఫణి వంటి ప్రముఖ నటులు ఈ సిరీస్‌లో కీలక పాత్రల్లో కనిపించడం విశేషం. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర సంగీతం ఈ వెబ్ సిరీస్‌కు మరో హైలైట్‌గా నిలవనుంది.

ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే, అద్భుతమైన నటన, సాంకేతిక నైపుణ్యంతో "నెట్‌వర్క్" వెబ్ సిరీస్ ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ వీకెండ్‌లో చూడాల్సిన వెబ్ సిరీస్‌లలో ఇది కచ్చితంగా ఒకటి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+