సమంతకు వెల్లువెత్తిన సింపతీ.. నిశ్చితార్ధం నాడే నాగచైతన్య, శోభితలకు బిగ్ షాక్!!
నాగచైతన్య సమంత పెళ్లి చేసుకుని కొంతకాలం సంతోషంగా జీవించిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగచైతన్య శోభిత దూళిపాళ్లతో లవ్ లో ఉన్నాడని ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. అసలు నాగచైతన్య సమంత విడిపోవడానికి శోభిత ధూళిపాళ కారణం అంటూ కూడా నెటిజెన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తో జనాలకు షాక్
అంతేకాదు నాగచైతన్య సమంతల పెళ్లికి ముందే శోభితతో డేటింగ్ చేశాడంటూ కూడా పెద్ద ఎత్తున పుకార్లు ప్రచారం అయ్యాయి. సమంత నాగచైతన్యకు మధ్య విభేదాలు రావడానికి శోభిత కారణమని కూడా రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ రూమర్స్ కు బలాన్ని చేకూరుస్తూ నాగచైతన్య ఆమెతోనే ఎంగేజ్మెంట్ చేసుకొని ఊహించని విధంగా అందరికీ షాక్ ఇచ్చాడు.

సమంతపై పెరిగిన సింపతీ
ఈరోజు ఉదయం 9 గంటల 42 నిమిషాలకు శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య నిశ్చితార్థ వేడుక హైదరాబాద్లోని నాగార్జున ఇంట్లో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన నాగార్జున, వీరిద్దరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇక ఈ నిశ్చితార్థ వేడుకతో ఒక్కసారిగా సమంత పైన జనాలకు సింపతి పెరిగిపోయింది. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకోవడం పైన నెటిజన్లు భగ్గుమంటున్నారు.
మూడో భార్య ఎవరో కూడా చెప్పాలని పోస్టులు
ఇక శోభితతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలను చూస్తున్న నెటిజన్లు సమంతకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. ఇక ఈ ఫోటోలను చూసిన కొందరు ఇంతకీ మొదటి భార్య ఎవరు? మాకు అర్థం కాలేదు సార్.. కొంచెం క్లారిటీ ఇవ్వండి అంటూ ప్రశ్నిస్తున్నారు అలాగే మీ మూడో భార్య గురించి కూడా ముందే చెప్పేస్తే మేము సైలెంట్ అవుతామంటూ నేటిజెన్లు నాగచైతన్యను ఏకిపారేస్తున్నారు.
నాగ చైతన్యతో విడాకుల తర్వాత మయోసైటిస్ బారిన పడిన సమంత
ఇట్లా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడో లేదో అలా నాగ చైతన్య , శోభితలు పెద్ద ఎత్తున ట్రోలింగుకు గురవుతున్నారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. మయోసైటిస్ బారిన పడి దాని నుండి బయటపడడానికి చాలా కష్టపడిన విషయం కూడా తెలిసిందే.
నాగ చైతన్య ను ఏకిపారేస్తున్న నెటిజన్లు
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన మనసులో కలుగుతున్న బాధను ప్రతీసారి సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెబుతోంది. ప్రస్తుతం నాగచైతన్య ఎంగేజ్మెంట్ తో సమంత హార్ట్ బ్రేక్ అయి ఉంటుందని నాగచైతన్య శోభితతో కలిసి సమంతను మోసం చేశాడని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.తమదైన శైలిలో నాగ చైతన్యకు కౌంటర్ వేస్తున్నారు.












Click it and Unblock the Notifications