పెళ్లైన ఏడాదికి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్

తాప్సీ పన్ను..ఈ పేరును కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. తాప్సీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 14 ఏళ్లు దాటింది. తాప్సీ తన కెరీర్‌ను మోడలింగ్‌తో ప్రారంభించి, 2010 లో తెలుగు సినిమా "ఝుమ్మంది నాదం" తో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.కేవలం తెలుగు మాత్రమే కాకుండా, హిందీ మరియు తమిళ చిత్రాల్లో కూడా తన నటనతో అందరిని ఆకట్టుకుంది.

ఆమె కెరీర్ లోని ముఖ్యమైన మలుపులు, సినిమాలు మరియు అవార్డుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాల్లో నటించిన తాప్సీ, తర్వాత హిందీ సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. "పింక్", "ముల్క్", "బద్లా", "మన్మర్జియన్" వంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ సినిమాల్లో ఆమె ప్రదర్శించిన నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు.

Taapsee Pannu reveals the actual date of her wedding

తాప్సీ పన్ను, డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ఆటగాడు మథియాస్ బో అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే అందరూ తాప్సీ పెళ్లి 2024లో జరిగిందని భావించారు. తాప్సీ సైతం తన భర్తను 2024లోనే అందరికి పరిచియం చేసింది. తాజాగా పెళ్లి విషయంలో తాప్సీ ఎవరూ ఊహించని షాకిచ్చింది. అందరూ అనుకున్నట్లు తన పెళ్లి 2024లో కాకుండా, 2023 డిసెంబర్‌లోనే జరిగిందని చెప్పి షాకిచ్చింది.

వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగింది. తాప్సీ పెళ్లి చాలా ప్రైవేట్‌గా జరిగింది. కుటుంబ సభ్యులు మరియు కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాప్సీ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచాలని ఇష్టపడుతుంది కాబట్టి, వారి పెళ్లిని చాలా సింపుల్‌గా జరుపుకున్నారు. తాప్సీ మరియు మథియాస్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు.వీరిద్దరూ తమ సంబంధం గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడుకోవడం కనిపించలేదు. తాప్సీ తన పెళ్లి తర్వాత కూడా తన సినిమా కెరీర్‌పై దృష్టి సారించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+