ఈ వయస్సులో శ‌ృంగార సన్నివేశాలు అవసరమా.. రిపోర్టర్‌కు హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు.

తాజాగా ఓ హీరోయిన్ శృంగారం గురించి పబ్లిక్‌గా మాట్లాడి సంచలనం సృష్టించింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు టబు. 1990ల్లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు టబు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది ఈ అమ్మడు. టాప్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే యంగ్ హీరోలతో కూడా నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది.

Tabu open up on doing romantic films in their 50

టబు తన అందాలతో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవలే సెంకడ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ వరుస సినిమాలతో అలరిస్తోంది. బాలీవుడ్‌ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌లో నటిస్తూ మళ్లీ బిజీగా ఆర్టిస్ట్‌గా మారిపోయింది. బాలీవుడ్ అజయ్ దేవగన్ హీరోగా వస్తున్న 'ఔర్ మే క్యా దమ్ థా' సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. మూవీ ప్రమోషన్‌లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న టబు రిపోర్టర్స్‌కు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

ఈ సమయంలో ఓ రిపోర్టర్ టబును ఈ వయసులో మీకు రొమాంటిక్ సినిమాలు అవసరమా అని ప్రశ్నించాడు. దీనికి టబు సైతం రిపోర్టర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.దీనిపై ఆమె స్పందిస్తూ.. శృంగారం కేవలం యువకులకు లేదా పరిమిత వయస్సుకు మాత్రమే కాదని తెలిపింది టబు. తన కొత్త సినిమా ప్రేమ, శృంగారం కంటే రిలేషన్ షిప్‌తో ముడిపడి ఉంటుందని తెలిపింది. అలాగే ప్రేమ,శృంగారంలాంటివి మానవ సంబంధాలలో భాగమని టబు చెప్పుకొచ్చింది. ఈ అమ్మడి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+