ఇదేం బూతు సినిమా బాబోయ్.. తమన్నా ఇలా అయిపోయిందేంటి..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు. అందం, వయసు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలి అంటారు నిపుణులు. స్టార్ హీరోలు అయితే 90 ఏళ్లు వచ్చినా హీరోలుగానే చలామణి అవుతారు. కానీ హీరోయిన్లు అలా కాదు. వారికి ఉన్న కొద్ది పీరియడ్ లోనే సంపాదించుకోవాలి. ఆ తర్వాత హీరోయిన్ పాత్రలు తగ్గిపోయి.. తల్లి, చెల్లి పాత్రల్లో నటించాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది హీరోయిన్లు అందం, వయసు ఉన్నప్పుడే హీరోయిన్లు గా రాణిస్తారు. ఆ తర్వాత నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా మారిపోతుంటారు. మరికొంత మంది పెళ్లి చేసుకుని సెటిల్ అయి పోతుంటారు.

అయితే మిల్క్ బ్యూటీ తమన్నా కెరీర్ బిగినింగ్ లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లోనూ రాణించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది తమన్నా. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ముట్టుకుంటే మాసిపోయే అందంతోపాటు నటన, డ్యాన్స్ తో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అలా రొమాంటిక్ సీన్స్, ముద్దు సీన్స్ కు దూరంగా ఉంటూ కథకు తగ్గ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న చిత్రాలు చూస్తే అటు ఫ్యాన్స్ తోపాటు సినీ అభిమానులు షాక్ అవుతున్నారు.

Tamannaah s Bold Venture Do You Wanna Partner Hits Amazon Prime on September 12

ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న తమన్నా.. ఇటీవలి కాలంలో అడల్ట్ రేటెడ్ మూవీస్ తప్ప మామూలు కంటెంట్ సినిమాల్లో నటించడం లేదు. గతంలో ఆమె ది లస్ట్ స్టోరీస్ 2 లో తన మాజీ ప్రేమికుడు విజయ్ వర్మ తో కలిసి చేసిన రొమాన్స్ ఏ రేంజ్ సెన్సేషనల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాక జీ కర్దా అనే అడల్ట్ రేటెడ్ వెబ్ సిరీస్ కూడా చేసింది తమన్నా. ఇక తాజాగా డు.. యూ.. వన్నా పార్టనర్ అనే మరో అడల్ట్ రేటెడ్ వెబ్ సిరీస్ లో నటించింది తమన్నా. ఇది లెస్బియన్ లవ్ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. ఇందులో తమన్నా తో పాటు దియానా కూడా మరో లీడ్ రోల్ చేస్తుంది. సెప్టెంబర్ 12 నుండి ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+